UPI: దేశ ఆర్థిక రంగంలోకి UPI వ్యవస్థను విజయవంతంగా చొప్పించడం ఓ సాంకేతిక విప్లవమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజూ కోట్లాది లావాదేవీలు ఈ విధానంలోనే జరుగుతున్నాయి. దీనికి పూర్వం ఇంటర్నెట్ బ్యాంకింగ్, SMS బ్యాంకింగ్ వంటివి అందుబాటులో ఉన్నా.. కొంతమేర సంక్లిష్టంగా ఉండేవి. UPI వచ్చిన తర్వాత చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. చెల్లింపులు, నగదు బదిలీ వంటి పలు ఆర్థిక కార్యకలాపాలను అత్యంత సులభంగా క్షణాల్లో చేసేయగలుగుతున్నాం.
UPI బిగ్ సక్సెస్ కావడం వల్ల రెట్టించిన ఉత్సాహంతో UPI 2.0 ను RBI ప్రారంభించింది. ఇందులో భాగంగా UPI 123Pay విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం స్మార్ట్ ఫోన్లతోనే కాకుండా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు సైతం UPI సేవలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఎందుకంటే దేశంలో ఇప్పటికే 40 కోట్ల మంది భారతీయులు ఫీచర్ ఫోన్లను వాడుతున్నట్లు అంచనా. ఇందుకు తోడు ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాలకూ డిజిటల్ బ్యాంకింగ్ ను తీసుకెళ్లడానికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది.
123PAY ద్వారా ఫీచర్ ఫోన్ వినియోగదారులు వివిధ రకాల డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి 4 విభిన్న విధానాలు ఉన్నాయి. యాప్, మిస్డ్ కాల్, సౌండ్ చెల్లింపు, IVE (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్)లు. ఈ పద్ధతుల్లో అందించబడుతున్న సేవలు కేవలం హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా పలు ప్రాంతీయ భాషల్లోనూ లభిస్తున్నాయి. తద్వారా గ్రామీణ వినియోగదారుల సంఖ్యను పెంచడంలో గణనీయంగా ఉపయోగపడుతుంది.
ఫీచర్ ఫోన్‌లలో UPI 123Pay ద్వారా చెల్లింపులు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది:
మిస్డ్ కాల్స్: ఆయా బిల్లులు, కిరాణా దుకాణాలు తరహా చెల్లింపులు చేసేందుకు ఓ కామన్ నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. UPI పిన్ ఎంటర్ చేసి తదితర లావాదేవీలను ప్రామాణీకరించవచ్చు.
UPI యాప్: ఫీచర్ ఫోన్ల కస్టమర్లు ఓ యాప్ ను మొబైల్ లో ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ మినహా ఇతర బదిలీ సేవలను ఇది సపోర్ట్ చేస్తుంది. ఫాస్టాగ్, LPG, విద్యుత్ బిల్లులు మొదలైన ఆన్‌లైన్ చెల్లింపులు ఫీచర్ ఫోన్లలో చేయడం కోసం ప్రత్యేకంగా ఈ యాప్ రూపొందించబడింది.
IVR: IVR ద్వారా చెల్లించాలంటే, కస్టమర్ ముందుగా నిర్ణయించిన ఫోన్ నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. UPI పిన్ ప్రామాణీకరణ తర్వాత, సూచనల ప్రకారం కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవాలి. యుటిలిటీ బిల్లులు, ఫండ్ బదిలీలు మరియు రీఛార్జ్‌లు చెల్లించడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది.
సామీప్య సౌండ్ చెల్లింపులు: ఏదైనా పరికరంలో కాంటాక్ట్‌లెస్, ఆఫ్‌లైన్ మరియు దగ్గరి డేటా బదిలీని ప్రారంభించడానికి సాంకేతికత ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు. దీనిలో అంతర్లీనంగా ఉన్న సాంకేతికత ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లు, కార్డ్ స్వైప్ మెషీన్‌లు మరియు పాయింట్-ఆఫ్-సేల్ పరికరాలతో సహా వివిధ రకాలుగా చెల్లింపులు చేయవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications