UPI Rejected: భారతదేశ సిలికాన్ సిటీ బెంగుళూరు డిటిటల్ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రంలోని మోదీ సర్కారు దేశాన్నిడిజిటల్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే బెంగుళూరు నగరంలోని వ్యాపారులు మాత్రం డిజిటల్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు నగరం ఇప్పుడు కేవలం నగదు రహిత లావాదేవీల వైపు మాత్రమే మొగ్గు చూపుతోంది. నగరంలో ఎక్కడ చూసినా యూపీఐ లావాదేవీలు లేవు..కేవలం నగదు రూపంలో మాత్రమే కొనుగోలు చేయండి అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.
నగరంలో చిన్న వ్యాపారులు ఎక్కడ చూసినా ఇవే బోర్డులతో కనిపిస్తున్నారు. నగదు ఇచ్చి కొనుగోలు చేయండి. ఫోన్ పే, గూగుల్ పే లాంటివి మా దగ్గర లేవని చెబుతున్నారు. ఒకనాడు యూపీఐ లావాదేవీలను అమితంగా ఇష్టపడిన వ్యాపారులు ఇప్పుడు పన్ను అధికారుల భయంతో రూటు మార్చారు. ఇన్‌కంట్యాక్స్ అధికారులు విధించే జీఎస్టీ నోటీసులకు భయపడి షాపుకు వచ్చే వినియోగదారులను నగదు రూపంలో చెల్లించమని అడుగుతున్నారు.

టైమ్స్ కథనం ప్రకారం.. ఓ వ్యాపారి మాట్లాడుతూ.. రోజుకు మూడు వేల రూపాయల వరకు వ్యాపారం చేస్తానని అయితే వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవిస్తుంటే పన్ను అధికారులు జీఎస్టీ పేరుతో తాట తీస్తారేమోనని భయంగా ఉందన్నారు. అందుకే UPI చెల్లింపులు చేయవద్దని కస్టమర్లకు చెబుతున్నాను అని తెలిపారు. క్యాష్ రూపంలోనే వస్తువులును కొనమని చెబుతున్నానంటూ చెప్పుకొచ్చారు. దీని వల్ల నాకు పన్ను అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పుకొచ్చారు. అతనే కాదు.. నగరంలో చాలామంది చిన్న వ్యాపారులు ఇదే రకమైన నిర్ణయం తీసుకున్నారు.
దీనికి కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్య బెంగుళూరు నగరంలో చాలమందికి జీఎస్టీ నోటీసులు వచ్చాయి. వారిలో చిన్న వ్యాపారులు సైతం ఉన్నారు. వీరంతా వీధి పక్కన చిన్న చిన్న షాపులు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే రోడ్డు పక్కన ఉండే టిఫెన్ సెంటర్ల యజమానులకు కూడా ఇలాంటి నోటీసులు వచ్చాయి. లాయర్లు, అకౌంటెంట్లు, వ్యాపారులు చెప్పిన వివరాల ప్రకారం.. దాదాపు లక్షరూపాయలు కట్టాలని జీఎస్టీ నోటీసులు చాలా మందికి వచ్చాయి. ఇక జీఎస్టీ పరిధిలో లేని చిన్న చిన్న వ్యాపారులకు కూడా ఈ నోటీసులు రావడంతో వారంతా హడలిపోతున్నారు.
చాలా మంది విక్రేతలు GST అధికారుల వేధింపులకు గురవుతున్నారు.దీంతో వారంతా నగదు వైపుకు మారుతున్నారని బెంగళూరు వీధి విక్రేతల సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి న్యాయవాది వినయ్ కె శ్రీనివాస్ చెబుతున్నారు. ప్రస్తుత GST రూల్స్ ప్రకారం.. వ్యాపారుల వార్షిక టర్నోవర్ రూ. 40 లక్షలు దాటితే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. ఇక సర్వీస్ ప్రొవైడర్లకు ఈ పరిమితి రూ.20 లక్షలుగా ఉంది.
దీనిపై వాణిజ్య పన్నుల శాఖ స్పందించింది. వారు చెప్పిన వివరాల ప్రకారం.. 2021-22 నుండి UPI లావాదేవీల డేటా ప్రకారం GST రిజిస్ట్రేషన్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే నోటీసులు జారీ చేశామని తెలిపింది. రూ. 40 లక్షలకు పైగా లావాదేవీలు జరిపిన వారు వెంటనే వారి వ్యాపారాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. వారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని బహిర్గతం చేయాలని చెబుతున్నారు. పన్ను తప్పనిసరిగా చెల్లించాలని హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ జీఎస్టీ నోటీసుల వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిఎస్‌టి అధికారులు మాటలతో ఉండే గణాంకాలను టర్నోవర్ గా ఎలా కోట్ చేస్తారని కర్ణాటకలోని వాణిజ్య పన్నుల మాజీ అదనపు కమిషనర్ హెచ్‌డి అరుణ్ కుమార్ తెలిపారు. ఇది సాధ్యం కాదన్నారు. వాటిని నిరూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మనీలాండరింగ్ కేసుల మాదిరిగా కాకుండా, పన్ను డిమాండ్‌కు అర్హత కలిగిన వ్యాపారుల దగ్గర ధనాన్ని వారు రుజువు చేయాల్సి ఉందన్నారు.
ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాయాలనుకుంటున్నట్లు ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యే ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ఇక అన్ని UPI క్రెడిట్‌లు వ్యాపార ఆదాయాన్ని ప్రతిబింబించకపోవచ్చని మాజీ GST ఫీల్డ్ అధికారి చెబుతున్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం జీఎస్టీ పేరుతో ఇలాంటి పనులకు పాల్పడితే అన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహా ధోరణిని అవలంభిస్తాయని శ్రీని & అసోసియేట్స్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీనివాసన్ రామకృష్ణన్ చెబుతున్నారు.
2025-26 కాలానికి రూ.1.20 లక్షల కోట్ల వసూళ్లు జరపాలని కర్ణాటక పన్ను అధికారులు ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నారని తెలిపారు. సంక్షేమ హామీల అమలుకు నిధులు లేకపోవడంతో ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. పథకాల అమలుకు రూ.52 వేల కోట్లు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ కూడా ఇందులో భాగమేనన్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications