UPI: దేశంలో UPI సేవల వినియోగం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఈ విధానం ఎంతో సులభంగా, సురక్షితంగా ఉండటంతో వివిధ దేశాలు సైతం UPI నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ లిస్టులో యూరోపియన్ దేశం ఫ్రాన్స్ కూడా ఉండటం గమనార్హం.
ఫాస్ట్ పేమెంట్ సర్వీస్ UPIని కేవలం దేశానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయంగా విస్తరించాలని మోదీ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. రక్షణ రంగానికి సంబంధించి చర్చల నిమిత్తం భారత ప్రధాని రెండు రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే అక్కడ UPI సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇదొక గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సింగపూర్‌లోనూ UPI సేవలు ప్రారంభించారు. భారత్‌కు చెందిన NPCIతో అక్కడి Paynow జకతట్టడంతో.. ఇరు దేశాల మధ్య క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ఊపందుకున్నాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తే UPI సేవలను కలిగిన మొదటి ఐరోపా దేశంగా అవతరించనుంది.
అన్ని ఒప్పందాలు సకాలంలో పూర్తయితే మోదీ రెండు రోజుల పర్యటనలోనే ఈ సేవలను ఫ్రాన్స్ లో ప్రారంభించే అవకాశం ఉంది. తద్వారా సింగపూర్ మాదిరిగానే ఫ్రాన్స్ కు సైతం మొబైల్ అప్లికేషన్స్ ద్వారా మనీ ట్రాన్సఫర్ చేసుకునే వీలు కలుగుతుంది. ఇది ఇండియాలోని ఫిన్ టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో ఓ గొప్ప మైలురాయిగా నిలుస్తుందని అంచనా.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications