దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరుగుతోన్నాయి. ముఖ్యంగా యూపీఐతో భారీగా లావాదేవీలు కొనసాగుతోన్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. యూపీఐ ద్వారా చెల్లింపు చేయడం చాలా సులభం కావడంతో చాలా మంది యూపీఐని వాడుతున్నారు. నెల నెలకు యూపీఐ పేమెంట్స్ పెరుగుతోన్నాయి. జులై లో యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయి.
జులైలో యూపీఐ లావాదేవీలు కొత్త రికార్డును సృష్టించాయి. ఈ నెలలో యూపీఐ ద్వారా 1,444 కోట్ల లావాదేవీలు జరిగాయి. రూ.20.64 లక్షల కోట్లు ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ అయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) గణాంకాల ప్రకారం జూన్‌లో రూ.20.07 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. మేలో యూపీఐ ద్వారా రూ. 20.44 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. యూపీఐ ద్వారా లావాదేవీలు రూ. 20 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా మూడోసారి.

వార్షిక ప్రాతిపదికన జూలై 2023లో యూపీఐ ద్వారా మొత్తం 9,964 కోట్ల లావాదేవీల ద్వారా రూ. 15.33 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి.గత సంవత్సరంతో పోలిస్తే యూపీఐ లావాదేవీల సంఖ్యలో 45 శాతం, మొత్తంలో 35 శాతం పెరుగుదల నమోదు అయింది. జూన్ 2024లో యూపీఐ ద్వారా 1,389 కోట్ల లావాదేవీల ద్వారా రూ. 20.07 లక్షల కోట్ల బదిలీ అయ్యాయి. జూన్ నెలతో పోలిస్తే జులై నెలలో లావాదేవీల సంఖ్యలో 3.96 శాతం పెరుగుదల నమోదు అయింది.
మొత్తంలో 2.84 శాతం పెరుగుదల ఉంది. యూపీఐని నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినెలా ప్రారంభంలో దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీల గణాంకాలను విడుదల చేయడం గమనార్హం. ఎన్పీసీఐ భారతదేశంలో యూపీఐని నియంత్రిస్తుంది. యూపీఐ అనేది వర్చువల్ చెల్లింపు సేవ, దీని ద్వారా మీరు QR కోడ్ ద్వారా ఎలాంటి బ్యాంక్ ఖాతా, నంబర్ లేకుండానే ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు.


Click it and Unblock the Notifications