UPI News: కొత్త ఏడాదిలో యూపీఐ సేవల్లో వస్తున్న కీలక మార్పు.. తప్పక తెలుసుకోండి..
UPI 2024 Rules: దేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అతిపెద్ద సక్సెస్ చూసింది. ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయి.
నూతన ఏడాదిలో ఇందులో కొన్ని ప్రయోజనాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తోంది. UPI ద్వారా చెల్లించే కస్టమర్‌లు త్వరలో ట్యాప్ అండ్ పే సదుపాయాన్ని జనవరి 31, 2024 నుంచి అందుబాటులోకి వస్తోంది. ప్రభుత్వం అందించిన సర్క్యులర్ కి అనుగుణంగా.. త్వరలోనే యూపీఐ సేవల సంస్థలు తమ చెల్లింపు యాప్‌లో ఎప్పుడైనా UPI-ట్యాప్ అండ్ పే సదుపాయాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ సర్వీస్ గూగుల్ పే, భీమ్ యాప్, పేటీఎంలో ఎంపిక చేసిన కొంతమంది కస్టమర్‌లకు అందుబాటులో ఉంది.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఇతర కొత్త డిజిటల్ చెల్లింపు ఫీచర్లతో పాటు యూపీఐ ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. అలాగే ఇంటర్నెట్ లేకుండా, వాయిస్ కమాండ్స్ ద్వారా చెల్లింపులు చేసుకునేందుకు వెసులుబాటును తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ట్యాప్ సౌకర్యం కోసం ఒక వినియోగదారు UPI లైట్ ఖాతాను తెరిస్తే.. అతను రూ.500 కంటే తక్కువ విలువైన లావాదేవీలు చేయవచ్చు. 500 కు మించి చెల్లింపులకు పిన్ అవసరం.
అదే సమయంలో వ్యాపారులకు UPI స్మార్ట్ QR లేదా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(NFC) సాంకేతికతతో కూడిన ట్యాగ్ అవసరం. పైగా ఈ సదుపాయంలో మొబైల్ ఫోన్ నుంచి QR కోడ్‌ను స్కాన్ చేయవలసిన అవసరం లేదు. కస్టమర్ కేవలం QR కోడ్ మెషిన్ లేదా పేమెంట్ మెషీన్‌తో మొబైల్‌ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత చెల్లింపు జరుగుతుంది. ఈ సదుపాయాన్ని పొందాలంటే మొబైల్‌లో ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉండాలి.


Click it and Unblock the Notifications