ఒకప్పుడు కేవలం కాష్‌నే నమ్మిన మనం, ఇప్పుడు ఫోన్‌లో రెండు ట్యాప్స్‌తోనే బిల్లు క్లియర్ చేసేస్తున్నాం. UPI వచ్చాక కొనుగోళ్లు చేయడం కేవలం సులభమే కాదు అలవాటైపోయింది కూడా. అయితే ఈ డిజిటల్ పేమెంట్ హవా అందరికీ లాభం చేకూర్చిందా? అంటే లేదు. కొన్ని రంగాలు UPIతో పటాపంచలుగా ఎదుగుతుంటే, ఇంకొన్ని మాత్రం ఒక్కొక్కటిగా దుకాణం మూసేస్తున్నాయి.

దూసుకెళ్తున్న రంగాలు:
ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు: 2025 ఏప్రిల్-ఆగస్టులో ఫాస్ట్ ఫుడ్ దుకాణాల్లో UPI పేమెంట్స్ 255% పెరిగి 5.9 బిలియన్ ట్రాన్సాక్షన్లకు చేరాయి. మొత్తం విలువ 228% పెరిగి రూ. 69,133 కోట్లకు చేరింది. 5 నెలల్లో ఒక్కో వ్యక్తి సగటున 4.1 సార్లు ఫాస్ట్ ఫుడ్ కొన్నారని అర్థం. (2023లో ఇది కేవలం 1.2 మాత్రమే) అయితే ఒక్కో ట్రాన్సాక్షన్ సైజ్ మాత్రం రూ. 127 నుంచి రూ. 117కి కాస్త తగ్గింది.
ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు: ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో పేమెంట్స్ 238% పెరిగి 505 మిలియన్లకు చేరాయి. మొత్తం విలువ రూ. 33,947 కోట్లకు చేరింది. ఒక్కో వ్యక్తి సగటున 0.35 సార్లు ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్లు చేశారు. ఇది ఈ రంగంలో UPI ఆధిపత్యాన్ని చూపిస్తోంది.
గ్రోసెరీస్ మరియు సూపర్ మార్కెట్లు: రోజువారీ ఖర్చుల్లో UPI బలంగా స్థిరపడిపోయింది. గ్రోసరీ షాపుల్లో 14.5 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగి రూ. 3.2 లక్షల కోట్లకు చేరాయి. అంటే 5 నెలల్లో ఒక్కో వ్యక్తి దాదాపు 10 సార్లు ఇక్కడ UPI వాడినట్టే!
కిందకు పడుతున్న రంగం:
డిపార్ట్‌మెంట్ స్టోర్‌లు: ఈ స్టోర్లలో ట్రాన్సాక్షన్లు దాదాపు 80% తగ్గి 332 మిలియన్లకు పడిపోయాయి. విలువ కూడా రూ. 21,156 కోట్లకు తగ్గింది. అయితే ఒక్కో బిల్లు మాత్రం పెద్ద మొత్తంలో ఉంటోంది. సగటు టికెట్ సైజ్ రూ. 637కి పెరిగింది (మూడు రెట్లు పెరుగుదల!) అంటే, ఇక్కడ ఇప్పటికీ కొంతమంది ఉన్నా వారు పెద్ద బిల్లులకే UPI వాడుతున్నారు.
మిగతా రంగాల్లో కూడా UPI వినియోగం బాగా పెరిగింది. ఉదాహరణకి, మందుల దుకాణాలు మరియు ఫార్మసీల్లోనే 1.36 బిలియన్ లావాదేవీలు జరిగి, దాదాపు రూ. 54,721 కోట్లు చెల్లింపులు జరిగాయి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ సగటు రూ. 400 చుట్టూ ఉంది. ఇదే విధంగా, డెయిరీల్లో కూడా 870 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగి రూ. 21,928 కోట్లు తిరిగాయి. అలాగే ప్రభుత్వ సేవలకూ ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్స్ మంచి ఊపునిచ్చాయి. 508 మిలియన్ ట్రాన్సాక్షన్ల ద్వారా రూ. 48,847 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి.
మొత్తానికి UPI వినియోగం ఇప్పుడు మన రోజు వారీ జీవనశైలిలో బలంగా కలిసిపోయింది. ఫాస్ట్ ఫుడ్, ఈ-కామర్స్, గ్రోసరీ షాపులు రికార్డు వృద్ధిని సాధిస్తుంటే, డిపార్ట్‌మెంట్ స్టోర్స్ మాత్రం ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాయి. డిజిటల్ పేమెంట్ మ్యాప్‌లో అవి నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి!
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications