ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యుపిఐ (Unified Payments Interface). ఈ UPI ఇప్పుడు మరింత శక్తివంత సాధనంగా మారబోతోంది. 2025 ఆగస్టు 31 నుంచి, యుపిఐ యాప్‌లు (PhonePe, Google Pay, Paytm ఇతర యాప్స్) ద్వారా మీరు ముందే ఆమోదించబడిన లోన్లు, క్రెడిట్ లైన్లను నేరుగా ఉపయోగించుకోవచ్చు.
యూపీఐ ద్వారా డబ్బు పంపడం, షాపింగ్ చేయడం, స్థానిక దుకాణాల్లో చెల్లింపులు చేయడం, లేదా నగదు డ్రా చేసుకోవడం.. ఇవన్నీ ఇప్పుడు మీ లోన్ ఖాతా నుంచే చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు వినియోగదారులకు ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి UPI యాప్‌ల ద్వారా లోన్లు పొందే సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఈ సదుపాయాన్ని ఆగస్టు 31, 2025 నాటికి ప్రారంభించాలని NPCI ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటివరకు మీ స్మార్ట్ ఫోన్లో యుపిఐ క్రెడిట్ ఫీచర్ ప్రధానంగా షాపుల్లో చెల్లింపుల వరకే పరిమితం అయింది. అయితే కొత్తగా వచ్చిన మార్పు వల్ల క్రెడిట్‌ను తక్షణమే ఉపయోగించుకోవడానికి అవకాశం లభిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు మీ అకౌంట్లో డబ్బు ఉన్నప్పుడే చెల్లింపులు జరిపే వారు. అయితే కొత్తగా NPCI (National Payments Corporation of India) తీసుకువచ్చిన మార్పులతో లెన్ ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. ముందే ఆమోదించబడిన లోన్లను షరతులతో కూడిన నిబంధనలతో యుపిఐ ద్వారా వాడుకోవచ్చు.
ఉదాహరణకు FD (Fixed Deposit) పై మీకు లోన్ ఉంటే నేరుగా యుపిఐ స్కాన్ ద్వారా మీరు ఆసుపత్రి బిల్లులు చెల్లించవచ్చు. ఇక చిన్న వ్యాపారులు బిజినెస్ ఓవర్‌డ్రాఫ్ట్ ద్వారా సప్లయర్లకు లేదా ఉద్యోగులకు మీరు వాడే యుపిఐతో చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉంటే కళాశాల ఫీజులు నేరుగా యుపిఐతోనే చెల్లించవచ్చు. అయితే ఇందులో ఒక షరతు ఉంది. మీరు లోన్ ఏ ప్రయోజనం కోసం ఆమోదించబడిందో ఆ ఉద్దేశ్యం కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు విజయవాడలో ఒక షాపు యజమాని తన బంగారు ఆభరణాలపై లోన్ తీసుకున్నాడనుకుంటే..అతను బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు ఆ లోన్ మొత్తం నుండి నేరుగా యుపిఐ ద్వారా హోల్‌సేల్ వెండర్‌కు చెల్లించే అవకాశం ఉంది. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంటే లోన్ అమౌంట్ ను యూపీఐకి లింక్ చేసుకుని లావాదేవీలు జరుపుకోవచ్చు.
ఇప్పటి వరకు యుపిఐతో RuPay క్రెడిట్ కార్డులు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు మాత్రమే వాడుకునే వీలు ఉండేది.2025 ఆగస్టు 31 తర్వాత రూల్స్ మారనున్నాయి. FD (Fixed Deposit) లోన్లు, బాండ్లు లేదా షేర్లపై క్రెడిట్, ప్రాపర్టీ మీద క్రెడిట్ ,గోల్డ్ లోన్లు ,పర్సనల్ లోన్లు , అన్‌సెక్యూర్డ్ లోన్లు , కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) లోన్లు, లింక్ చేసుకునే వీలు ల్పిస్తోంది.
అయితే మీరు లోన్ మొత్తాన్ని స్వేచ్ఛగా ఖర్చు చేయలేరు. లోన్ ఉద్దేశ్యం ప్రకారమే వినియోగించాలి.సంబంధిత బ్యాంక్ అనుమతి ఆధారంగా పేమెంట్లు జరుగుతాయి.ప్రతి బ్యాంక్‌కు వేర్వేరు నియమాలు ఉండవచ్చు.రోజు వారి లావాదేవీల విషయానికి వస్తే.. P2P (పర్సన్ టు పర్సన్) & P2M (పర్సన్ టు మర్చంట్) ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 1 లక్ష లావాదేవీలు చేయవచ్చు. క్యాష్ విత్‌డ్రా లిమిట్ రోజుకు రూ. 10,000 మాత్రమే ఉంటుంది. ఇక రోజుకు గరిష్టంగా 20 ట్రాన్సాక్షన్లు మాత్రమే చేయాల్సి ఉంటుంది.
చిన్న పట్టణాలు లేదా గ్రామాల్లో ఉండే వారు లేదా చిన్న వ్యాపారులు,క్రెడిట్ కార్డులు లేని వారికి సులభంగా క్రెడిట్‌కి యాక్సెస్ ఇవ్వడం ఈ మార్పు ముఖ్య లక్ష్యం. క్రెడిట్ కార్డు అవసరం లేకుండా, మీకు ఆమోదించబడిన లోన్‌ను యుపిఐ యాప్‌తో వాడుకోవచ్చు. అంతేకాక, మీరు ప్రతిరోజూ వాడే PhonePe, Google Pay వంటి యాప్‌లలోనే లోన్ ఖర్చులను ట్రాక్ చేసి నిర్వహించడం సులభమవుతుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications