UPI News: ఆందోళనలో PhonePe, Google Pay.. ఆ ఆవిష్కరణే కారణం..!!
UPI News: యూపీఐ చెల్లింపుల్లో వస్తున్న కొత్త ఇన్నోవేషన్ ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే వంటి దిగ్గజ పేమెంట్ సంస్థలకు ఆందోళన కలిగిస్తోంది. దీని గురించి PhonePe సహ వ్యవస్థాపకుడు అండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(CTO) రాహుల్ చారి ఆందోళన వ్యక్తం చేశారు.
NPCI, ఆన్‌లైన్ వ్యాపారులు వేగవంతమైన చెల్లింపులను ఎనేబుల్ చేసే కొత్త ఆవిష్కరణ గురించి ఎదురుచూస్తున్నారు. ఇది చెల్లింపు సంస్థల ఆధిపత్యానికి అవరోధంగా మారవచ్చని తెలుస్తోంది. ఇందులో ఆన్ లైన్ చెల్లింపులకు యూపీఐ ప్లగిన్ లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ అనబడే వర్చువల్ చెల్లింపు చిరునామాను జోడించడానికి వ్యాపారులను అనుమతి కల్పిస్తుంది. దీని వల్ల వినియోగదారులు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే వేగంగా తమ చెల్లింపులను పూర్తి చేయెుచ్చని వెల్లడైంది.

ఉదాహరణకు మీరు జొమాటోలో ఒక ఆర్డర్ పెట్టినప్పుడు దానికి చెల్లింపు చేసేందుకు యూపీఐ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే.. అది మిమ్మల్ని సదరు యూపీఐ చెల్లింపుల యాప్ కు రీరూట్ చేస్తుంది. పేమెంట్ తర్వాత తిరిగి జొమాటో యాప్‌లోకి తీసుకొస్తుంది. ఈ అదనపు దశ బహుళ కారణాల వల్ల చెల్లింపు వైఫల్యాలకు దారి తీస్తుంది. కానీ ఇకపై ఈ ఇబ్బంది లేకుండా నేరుగా జొమాటో యాప్ లోనే చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఫోన్ పే 47 శాతం, గూగుల్ పే 33 శాతం యూపీఐ చెల్లింపుల మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. అయితే Swiggy, Zomato, Flipkart, Myntra, Dream 11 వంటి పెద్ద వ్యాపారులు ఇన్‌లైన్ లేదా యాప్‌లో చెల్లింపులకు మారితే యూపీఐ చెల్లింపు దిగ్గజాలు మార్కెట్ వాటాను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి. వాస్తవానికి మొత్తం ఆన్‌లైన్ లావాదేవీల్లో దాదాపు 60 శాతం UPIని ఉపయోగించి జరుగుతాయి. రానున్న కొత్త యూపీఐ విధానం నిజంగా ఫిటె టెక్ కంపెనీల ఆధిపత్యానికి కళ్లెం వేసే అవకాశం ఉంది. దీనికి తోడు రానున్న కాలంలో డిజిటల్ రూపీ కూడా పెద్ద ప్రమాదంగా మారనుంది.


Click it and Unblock the Notifications