ప్రతి రోజు కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే యూపీఐ సేవలు ఇప్పటివరకు ఉచితంగానే అందుతున్నాయి. కానీ తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు దీనిపై కొత్తగా ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి. యూపీఐ లావాదేవీలకు ఖర్చులు ఉన్నాయి ఎవరైనా ఆ ఖర్చును భరించాల్సిందే అని అన్నారు. అంటే భవిష్యత్తులో యూపీఐ సేవలకు ఫీజులు వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.

ప్రతి రోజు యూపీఐ ద్వారా దాదాపు 640 మిలియన్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. 2025 జూన్ నెలలో మాత్రమే రూ 24 లక్షల కోట్ల విలువైన 18.39 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఇది గత సంవత్సరంతో పోల్చితే 32 శాతం ఎక్కువ.
మోనిటరీ పాలసీ కమిటీ సమావేశం తరువాత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ''యూపీఐ సేవలను నిర్వహించడానికీ ఖర్చులు వస్తాయి. అందుకే ఆ ఖర్చులను ఎవరైనా భరించాల్సి ఉంటుంది. అది వినియోగదారులైనా, లేదా సంస్థలైనా. దీర్ఘకాలికంగా ఈ సేవ కొనసాగాలంటే ఖర్చు విషయంలో స్పష్టత అవసరం," అని చెప్పారు.
ఇప్పుడు యూపీఐ (UPI) ఉచితంగా అందుతున్నా, భవిష్యత్తులో ఇది అలాగే కొనసాగుతుందా అన్నదానిపై చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే ICICI బ్యాంక్ కొన్ని యూపీఐ లావాదేవీలపై చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టింది. దీని వల్ల యూపీఐ పూర్తిగా ఉచితం కాదు అన్న మార్పు త్వరలోనే రానుందా అనే సందేహాలు ఏర్పడ్డాయి.
ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా యూపీఐ డిజిటల్ చెల్లింపుల్లో చాలా పెద్ద స్థాయిలో పనిచేస్తోంది. IMF నివేదిక ప్రకారం, యూపీఐ ద్వారా భారత్‌లో 85% డిజిటల్ చెల్లింపులు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60% లావాదేవీలు జరుగుతున్నాయి.
కాగా, యూపీఐ సేవలను ఉచితంగా కొనసాగించడానికీ ఖర్చులు ఉండటం వల్ల భవిష్యత్తులో ఈ ఖర్చులను ఎవరు భరిస్తారు? యూజర్లా? బ్యాంకులా? అన్నదానిపై స్పష్టత అవసరం. అందుకే దీన్ని స్థిరంగా కొనసాగించేందుకు చర్చలు జరుగుతున్నాయి.
UPIని ఉచితంగా అందించడానికి ఇప్పటిదాకా ప్రభుత్వంతో పాటు కొన్ని బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు విధించలేదు. కానీ దీనికోసం వారు వెనకనుంచి నిర్వహణ ఖర్చులను భరించాల్సి వచ్చింది. 2022లో కేంద్ర ప్రభుత్వం UPI సేవలను ఉచితంగా ఉంచడానికి బ్యాంకులకు మరియు NPCIకి రూ. 1,500 కోట్ల వరకు "పబ్లిక్ గుడ్" సబ్సిడీని ఇచ్చింది. కానీ ఈ సబ్సిడీలు స్థిరంగా రావడం లేదు. అందుకే UPIని నిర్వహించేందుకు కొత్త ఆదాయ మార్గాలు అవసరం.
ఉచిత యూపీఐ సేవల వల్ల చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్‌ను స్వీకరించగలిగారు. ఇప్పుడు ఛార్జీలు వస్తే, వారు మళ్లీ క్యాష్ పేమెంట్స్‌కే తిరిగి వెళ్లే ప్రమాదం ఉంది. చిన్న మొత్తాల లావాదేవీలకు ఛార్జీలు లేకుండా ఉంచి, పెద్ద మొత్తాలపై మాత్రమే కొద్దిగా ఫీజు వసూలు చేసే విధానం తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదా, మర్చెంట్ ట్రాన్సాక్షన్లపైనే ఛార్జీలు విధించొచ్చు. యూపీఐ ఒక యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్‌గా ప్రజల్లో విశ్వసనీయత పొందింది. ఇప్పుడు దానిపై ఛార్జీలు వస్తే, వినియోగదారులు ఇతర మార్గాల వైపు వెళ్తారేమో అన్నదాని పైనా ఆందోళనలు ఉన్నాయి.
ఇది ఒక పెద్ద ఆర్థిక, పాలసీ మార్పుకు సంకేతమవుతుంది. డిజిటల్ ఇండియాకు యూపీఐ సేవలు భవిష్యత్తులో చెల్లింపుల మార్గాన్ని ఎలా మార్చబోతున్నాయో చూడాలి.


Click it and Unblock the Notifications