గత రెండురోజులుగా దేశవ్యాప్తంగా యుపిఐ సేవలు మొరాయించాయి. దీని వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, నిన్న రాత్రి 7:50 గంటల వరకు UPI అంతరాయంపై 2,750 ఫిర్యాదులు నమోదయ్యాయి. అంటే వీరిలో 296 మంది గూగుల్ పే యూజర్లు, పేటీఎం యాప్ వాడే 119 మంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యాప్ ఉపయోగించే 376 మంది ఉన్నారు. చాలా మంది SBI కస్టమర్లు మనీ ట్రాన్స్ఫర్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్లో సమస్యలను నివేదించారు. అయితే జనవరిలో UPI ట్రాన్సక్షన్స్ 16.99 బిలియన్లు దాటాయి. దీని విలువ రూ.23.48 లక్షల కోట్లకు పై మాటే. ఈ మొత్తం ఇప్పటివరకు అత్యధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

క్షమాపణ చెప్పిన NPCI: UPIని డెవలప్ చేయడం, మెయింటైన్ చేసేందుకు బాధ్యత వహించే NPCI ఈ లోపాన్ని అంగీకరించింది. 'NPCI కొన్ని టెక్నికల్ సమస్యలను ఎదుర్కొంది అని తెలిపారు. దీని కారణంగా UPI సేవలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ సమస్య పూర్తిగా పరిష్కరించబడింది అలాగే సిస్టం ఎప్పటిలాగే యాక్టీవ్గ పనిచేస్తోంది. మీ కలిగిన అసౌకర్యానికి NPCI క్షమాపణలు కోరుతున్నట్లు ట్వీట్ చేసింది.
వేగంగా పెరుగుతున్న UPI వినియోగం: ఈ ఏడాది జనవరిలో UPI లావాదేవీలు 16.99 బిలియన్లను దాటాయి. దీని విలువ రూ.23.48 లక్షల కోట్లకు పైగానే. భారతదేశ డిజిటల్ పేమెంట్ సిస్టంలో UPI ఒక ముఖ్యమైన భాగం. దేశంలో 80% పేమెంట్లు UPI ద్వారానే జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో (జనవరి 2025 వరకు) పీపుల్-టు-మర్చంట్ (P2M) ట్రాన్సక్షన్స్ 62.35%, P2P ట్రాన్సక్షన్స్ 37.65%గా ఉన్నాయి. దీని అర్థం ఎంతో మంది UPI ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. P2P అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి పేమెంట్ చేయడం.
UPI అంటే ఏమిటి: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది 'డిజిటల్ ఇండియా' క్యాంపైన్, ఈ సిస్టం దేశాన్ని క్యాష్ లెస్ పేమెంట్ యుగంలోకి నడిపిస్తుంది. RBI-రేగులేటెడ్ సంస్థ IMPS మౌలిక సదుపాయాలపై UPI సిస్టం అభివృద్ధి చేసింది. UPIతో ప్రజలు ఏదైనా రెండు బ్యాంక్ అకౌంట్స్ మధ్య ఇన్స్టంట్ మని ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
భారతదేశంలో UPI అంతరాయం : భారతదేశంలో UPI పేమెంట్స్ తాత్కాలిక అంతరాయం, ప్రజలలో తీవ్ర గందరగోళానికి దారితీసింది, ఎందుకంటే చాలా మంది చిన్న ట్రాన్సక్షన్స్ కోసం డిజిటల్ పేమెంట్లపై ఎక్కువగా ఆధారపడతారు. మరికొంత మంది యూజర్లు సోషల్ మీడియాలో తమ కోపాన్ని వ్యక్తం చేశారు, UPI అంతరాయంపై మీమ్స్ కూడా షేర్ చేసారు. తరువాత ఈ సమస్య పరిష్కరించినట్లు, ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేసేటప్పుడు ఎటువంటి సమస్య ఉండదని NPCI అప్‌డేట్ చేసింది.
మీ UPI పేమెంట్ ఆగిపోతే ఎం చేయాలి: మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోతే లేదా స్తంభించిపోతే కొన్ని అనుసరించాల్సిన కీలక దశలు ఇక్కడ ఉన్నాయి:
-ముందుగా మీ పేమెంట్ స్టేటస్ అండ్ మీ పేమెంట్ హిస్టారి చెక్ చేయండి.
- డబ్బులు మీ అకౌంట్ నుండి కట్ అయ్యాక మీ పేమెంట్ ఫెయిల్ అయినట్లు చూపిస్తే మరో 48 గంటల్లో మీకు తిరిగి క్రెడిట్ అవుతుంది.
-మీరు మీ ట్రాన్సక్షన్స్ స్టేటస్ ట్రాక్ చేయలేకపోతే భయపడకండి, ఓపికతో 48 గంటలు వేచి ఉండండి. ఈ సమయంలో మీ బ్యాంక్ పేమెంట్ స్టేటస్ అప్ డేట్ చేస్తుంది.
-ఈ కాలంలో మీ ట్రాన్సక్షన్స్ సంబంధించిన ఏదైనా సమాచారం టెక్స్ట్ మెసేజ్ ద్వారా లేదా పేమెంట్లో అందినప్పుడు అప్ డేట్ ఉండండి.
-మీ డబ్బు 48 గంటల్లోపు తిరిగి మీ అకౌంట్లో క్రెడిట్ అవకపోతే మీ పాస్‌బుక్‌ను అప్ డేట్ చేయండి. అలాగే ట్రాన్సక్షన్స్ స్టేటస్ చెక్ చేయండి, ఒకవేళ పాస్‌బుక్‌లో సక్సెస్ అని కనిపిస్తే, మీ ఆన్‌లైన్ పేమెంట్ సమస్యను లేవనెత్తండి, బ్యాంక్ సహాయం తినుకోండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications