Zest Money: డిజిటల్ చెల్లింపుల రంగంలో దేశంలో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న ఫోన్ పే మరో ముందగుడు వేసింది. బై-నౌ-పే-లేటర్ (BNPL) ఫిన్‌టెక్ స్టార్టప్ జెస్ట్‌మనీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టింది. దీంతో కంపెనీ వినియోగదారులకు మరింత చేరువకానుంది. ఇది పేటీఎం నిర్వహిస్తున్న వ్యాపారానికి గట్టిపోటీగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ కీలక డీల్ విలువ దాదాపు 200 నుంచి 300 మిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. చివరి రౌండ్ నిధుల సేకరణ సమయంలో ZestMoney వ్యాల్యూయేషన్ 450 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ డీల్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ వర్గాలు మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కొనుగోలు తర్వాత సైతం జెస్ట్ పే సెపరేట్ కంపెనీగానే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన నిధుల అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున గత ఆరు నెలలుగా కొనుగోలుదారుల కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో కంపెనీ గతంలో పైన్ ల్యాబ్స్, భారత్ పే వంటి కంపెనీలతో సైతం చర్చలు నిర్వహించింది. అయితే తాజాగా వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫోన్ పే దీనిపై మక్కువ చూపుతోంది.

ఈ డీల్ వల్ల ఫోన్ పే సంస్థకు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్స్ లభించనుంది. డిజిటల్ చెల్లింపుల సంస్థ చాలా వచ్చే ఏడాది ఐపీవోగా మార్కెట్లోకి రావాలనుకోవటం, చాలా కాలంగా ఈ లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో డీల్ కీలకంగా మారుతోంది. బై నౌ పే లేటర్ కంపెనీలపై రిజర్వు బ్యాంక్ ఆంక్షలు పెట్టకముందు జెస్ట్‌మనీ నెలకు రూ.600 కోట్ల వ్యాపారాన్ని చేసింది. అయితే ఆంక్షల తర్వాత అది దాదాపు సగానికి పడిపోయింది. దీంతో కంపెనీ నష్టాలు సైతం భారీగానే పెరిగాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications