IPO News: ఇన్వెస్టర్లను నిరాశపరిచిన ఐపీవో.. మాకొద్దంటూ లిస్టింగ్ తర్వాత విక్రయం..!!
IPO News: ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఒక ఐపీవో ఇన్వెస్టర్లకు తుఫాను లాభాలను అందించగా.. మరొకటి మాత్రం నిరాశకు గురిచేసింది. ఇష్యూ ధర కంటే తక్కువ రేటుకు లిస్టింగ్ కావటంతో పెట్టుబడిదారులు నిరాశకు గురయ్యారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లోకి వచ్చిన అప్‌డేటర్ సర్వీసెస్ ఐపీవో గురించే. ఇది నిరాశాజనకమైన లిస్టింగ్ నమోదు చేసింది. బీఎస్ఈలో స్టాక్ డిస్కౌంట్ ధర రూ.299.90 వద్ద జాబితా చేయబడింది. అలాగే లిస్టింగ్ తర్వాత చాలా మంది ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించేందుకు ఎగబడ్డారు. దీని కారణంగా ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో స్టాక్ 5 శాతం క్షీణించి రూ.285 రేటుకు పడిపోయింది.

ఐపీవో కోసం స్టాక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.రూ.280 నుంచి రూ.300గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా ఐపీవో ద్వారా అప్‌డేటర్ సర్వీసెస్ మార్కెట్ల నుంచి రూ.640 కోట్లను సమీకరించింది. దీనికోసం 1.33 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను సెప్టెంబర్ 25-27 మధ్య కాలంలో కంపెనీ విక్రయించింది. ఈ క్రమంలో ఒక్కో లాట్‌లో 50 షేర్లు చొప్పున విక్రయించింది. అంటే ఒక్క లాట్ కొనాలనుకున్న ఇన్వెస్టర్లు కనీసం రూ.15,000 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది.
అప్‌డేటర్ సర్వీసెస్ ఐపీవో చివరి రోజున 2.96 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ విభాగంలో 1.45 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ కొనుగోలుదారుల విభాగంలో 4.50 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ల విభాగంలో 0.89 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. అలాగే ఐపీవో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.288 కోట్లను సమీకరించింది. దేశంలోని ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ మార్కెట్‌లో రెండవ అతిపెద్ద ప్లేయర్ గా కొనసాగుతోంది. మార్చి FY23తో ముగిసిన సంవత్సరానికి రూ. 34.6 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో ఆదాయం 41.3 శాతం పెరిగి రూ.2,104.9 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications