IPO News: నాలుగు రోజుల్లో ప్రారంభమౌతున్న ముంబై ఐపీవో.. ప్రైస్ బ్యాండ్ ప్రకటన..
IPO News: మార్కెట్లో ఇప్పుడు ఎటుచూసినా ఐపీవోల హడావిడే. మార్కెట్ల పతనంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఒకటో రెండో ఐపీవోల లిస్టింగ్, సబ్ స్క్రిప్షన్ జరుగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న Updater Services తన ఐపీవోను మార్కెట్ల ముందుకు తీసుకురావాలని చూస్తోంది. ఇందులో భాగంగా నేడు ప్రైస్ బ్యాండ్ ప్రకటించింది. సెప్టెంబర్ 25, 2023న ప్రారంభం కానున్న ఐపీవోలో ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.280-300గా ఉంటుందని వెల్లడించింది. ఈ ఐపీవోలో తాజా ఈక్విటీల ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం రూ.400 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ఉండనుంది. అలాగే మిగిలిన రూ.240 కోట్లుకు బదులు ముగ్గురు ప్రమోటర్లకు చెందిన 80 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రమోటర్ టాంగి ఫెసిలిటీ సొల్యూషన్స్ 40 లక్షల షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తోంది. అలాగే మిగిలిన 40 లక్షల షేర్లను ఇండియా బిజినెస్ ఎక్సలెన్స్ ఫండ్స్ II & IIA విక్రయిస్తుంది.
యాంకర్ బుక్ సెప్టెంబర్ 22న ఒక రోజు పాటు తెరవబడుతుంది. అయితే ఇష్యూ సెప్టెంబరు 27న ముగుస్తుంది. కంపెనీ తాజా ఇష్యూ రాబడిలో రూ.133 కోట్ల రుణ చెల్లింపులకు, రూ.115 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ.80 కోట్లను ఇన్ ఆర్గానిక్ కార్యక్రమాలకు వినియోగిస్తుండగా మిగిలిన మెుత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు ఉపయోగించాలని నిర్ణయించింది. దేశంలోని ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ మార్కెట్‌లో రెండవ అతిపెద్ద ప్లేయర్ గా కొనసాగుతోంది. మార్చి FY23తో ముగిసిన సంవత్సరానికి రూ. 34.6 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో ఆదాయం 41.3 శాతం పెరిగి రూ.2,104.9 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications