Upcoming IPOs: దేశంలో లోక్ సభ ఎన్నికల కోలాహలం ముగియటంతో కంపెనీలు సైతం తమ ఐపీవో ప్రణాళికలను వేగంగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో దాదాపు 11 కంపెనీల ఐపీవోలు తమ ఇష్యూని ప్రారంభించనున్నాయి. ఐపీవోలలో బెట్టింగ్ వేసి లాభాలను పొందాలనుకుంటున్న వారికి నిజంగా ఇదొక సదవకాశంగా చెప్పుకోవచ్చు.
1- వ్రాజ్ ఐరన్ అండ్ స్టీల్ ఐపీవో:
ఈ ఐపీవో జూన్ 26న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ ప్రారంభించనుంది. జూన్ 28 వరకు ఇన్వెస్టర్లకు బెట్టింగ్ వేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ప్రైస్ బ్యాండ్ ధరను పరిశీలిస్తే ఒక్కో షేరుకు రూ.195 నుంచి రూ.207గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ.70 కోట్ల రుణం తీసుకుంది.

2- అలైడ్ బ్లెండర్లు అండ్ డిస్టిల్లర్స్ ఐపీవో:
కంపెనీ ఈ ఐపీవో ద్వారా ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.1,500 కోట్లు సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. జూన్ 25న తెరుచుకోనున్న ఐపీవో జూన్ 27 వరకు పెట్టుబడిదారులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.267 నుంచి రూ.281గా నిర్ణయించింది.
3- స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీవో:
ఇష్యూ ప్రారంభించిన కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు రిటైల్ ఇన్వెస్టర్లకు జూన్ 25 వరకు అవకాశం ఉంది. ఈ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.351 నుంచి రూ.369గా నిర్ణయించబడింది.
4- ఎన్ న్యూట్రికా ఐపీవో:
ఇష్యూ జూన్ 20న ప్రారంభించబడిన కంపెనీ ఐపీవోలో జూన్ 24 వరకు పెట్టుబడిదారులు షేర్లను దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.51 నుంచి రూ.54గా నిర్ణయించింది. కంపెనీ షేర్లు BSE SME కేటగిరీలో జాబితా అయ్యేందుకు వస్తున్నాయి.
5- మెడికామెన్ ఆర్గానిక్స్ ఐపీవో:
కంపెనీ తన ఐపీవో ప్లాన్స్ ద్వారా మార్కెట్ల నుంచి ఏకంగా రూ.10.54 కోట్లు సమీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కంపెనీ దరఖాస్తుదారులకు 31 లక్షల తాజా షేర్లను జారీ చేయనుంది. జూన్ 21న ప్రారంభమైన ఐపీవో ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు జూన్ 25 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్రమంలో ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.32 నుంచి రూ.34గా నిర్ణయించారు.
6- విన్నీ ఇమ్మిగ్రేషన్ ఐపీవో:
కంపెనీ ఐపీవో జూన్ 20న ప్రారంభమైంది. దీనిలో పెట్టుబడిదారులు పందెం వేసేందుకు జూన్ 24 వరకు అవకాశం ఉంది. ఐపీవో కోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.140గా నిర్ణయించింది.
7- విసామాన్ గ్లోబల్ సేల్స్ ఐపీవో:
కంపెనీ ఐపీవో సోమవారం అంటే జూన్ 24న తెరవబడుతుంది. ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు జూన్ 26 వరకు ఐపీవో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.43గా నిర్ణయించింది.
8- అకికో గ్లోబల్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో:
కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.73 నుంచి రూ.77గా నిర్ణయించింది. ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు ఇష్యూ జూన్ 25న తెరుచుకోనుండగా.. జూన్ 27 వరకు వారు పాల్గొనేందుకు అవకాశం కల్పించబడింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ మార్కెట్ల నుంచి రూ.23.11 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.
9- డివైన్ పవర్ ఐపీవో:
ఈ ఐపీవో పరిమాణం రూ. 22.76 కోట్లు. ఐపీవో ద్వారా డబ్బును సమీకరించేందుకు కంపెనీ 56.9 లక్షల షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.36 నుంచి రూ.40గా నిర్ణయించబడింది. బెట్టింగ్ వేయాలనుకునే వారికి ఈ ఐపీవో జూన్ 25 నుంచి జూన్ 27 వరకు అవకాశం కల్పిస్తోంది.
10- పెట్రో కార్బన్ అండ్ కెమికల్స్ ఐపీవో:
కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.162 నుంచి రూ.171గా ప్రకటించింది. దీనిలో పాల్గొనేందుకు జూన్ 25 నుంచి జూన్ 27 వరకు కంపెనీ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించింది.
11- సర్వీసెస్ టెక్ ఐపీవో:
కంపెనీ ఐపీవో జూన్ 26 నుంచి జూన్ 28 వరకు తెరిచి ఉంటుంది. అలాగే ఐపీవోలో పాల్గొనేవారి కోసం ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.95 నుంచి రూ.100గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications