IPO News: కొత్త వారంలో వస్తున్న మరో ఐపీవో.. షేర్ ధర వెల్లడి.. వివరాలివే..
IPO News: ప్రతి వారం మార్కెట్లోకి ఏదో ఒక ఐపీవో వస్తూనే ఉంది. వీటిలో ఎక్కువ భాగం చిన్న మెుత్తల్లో నిధులను సమీకరించుకుంటున్న కంపెనీలే ఉన్నాయి. పైగా ఇన్వెస్టర్ల నుంచి వీటికి ఇటీవలి కాలంలో అత్యధికంగా ఆదరణ దొరుకుతోంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా ఐపీవో గురించే. ఈ కంపెనీ నీటి సరఫరా ప్రాజెక్టుల రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ ఐపీవో ఆగస్టు 24న ప్రారంభమై ఆగస్టు 28న ముగుస్తుంది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేర్ ఆఫర్ ధర రూ.94 నుంచి రూ.99గా ఉంటుందని ప్రకటించింది. నిధుల సమీకరణ కోసం కంపెనీ 3.12 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను ఐపీవో ద్వారా ఇష్యూ చేస్తోంది.

ఈ ఇష్యూలో కంపెనీ తన ఉద్యోగుల కోసం 3 లక్షల ఈక్విటీ షేర్లను రిజర్వు చేసింది. వారికి మాత్రం ఒక్కో షేరును రూ.9 తగ్గింపుతో అందిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా అప్పర్ ప్రైస్ బ్యాండ్‌లో రూ.308.88 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూ ద్వారా వచ్చిన మెుత్తంలో రూ.62.18 కోట్లను మెషినరీ కోసం మూలధన అవసరాలకు, రూ.150 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. మిగిలిన మెుత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనుంది.
అయితే యాంకర్ ఇన్వెస్టర్లకు ఇష్యూ ఆగస్టు 23న తెరవబడుతోంది. ఐపీవోలో పాల్గొనాలనుకునే పెట్టుబడిదారులు కనీసం 150 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 50 శాతం సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15 శాతం హెచ్ఎన్ఐలకు మిగిలిన 35 శాతం రిటైల్ పెట్టుబడిదారుల కోసం కంపెనీ నిర్థేశించింది. నీటి సరఫరా, రైల్వే, రోడ్డు నీటిపారుదల నెట్‌వర్క్ విభాగాలలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణంలో అనుభవం ఉన్న విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా నిర్వహిస్తోంది.
కంపెనీ ప్రస్తుతం దేశంలోని 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 51 ప్రాజెక్టులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జూలై 15, 2023 నాటికి మెుత్తంగా రూ.3,799.53 కోట్ల ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. మార్చి FY23తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రెట్టింపు చేసి రూ.90.64 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications