upcoming IPO 25 march: ఒక కంపెనీకి ఫండ్స్ అవసరమైనప్పుడు ఆ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే IPOతో వస్తుంది. దీని ద్వారా ప్రజలు డబ్బు పెట్టుబడి పెట్టి ఆ కంపెనీలో కొంత వాటా పొందుతారు. ఇప్పుడు శ్రీ అహింసా నేచురల్స్ కూడా IPOని తీసుకురాబోతోంది. ఈ IPO మార్చి 25న అంటే నేడు సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతుంది అలాగే మీరు మార్చి 27 వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.

కంపెనీ ప్రమోటర్లు అండ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు: శ్రీ అహింసా నేచురల్స్ IPOకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా శ్రీజన్ ఆల్ఫా క్యాపిటల్ అడ్వైజర్స్ LLP వ్యవహరిస్తుండగా, ఇష్యూకి కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఉంది.
ప్రైస్ బ్యాండ్: కంపెనీ కొత్తగా 42.04 లక్షల షేర్లను జారీ చేయడం ద్వారా రూ.50.02 కోట్లు సేకరించాలని ప్లాన్ చేసింది. 19.99 లక్షల ఆఫర్ ఫర్ సేల్ షేర్ల ద్వారా రూ.23.79 కోట్లు సేకరించాలని సన్నాహాలు చేస్తోంది. శ్రీ అహింస నేచురల్స్ IPO ధర ఒక్కో షేరుకు రూ.113-119 ఉండొచ్చు. కనీస లాట్ సైజు 1200 షేర్లు అలాగే రిటైల్ పెట్టుబడిదారులకు కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,35,600.
శ్రీ అహింసా నేచురల్స్ లిమిటెడ్ గురించి: శ్రీ అహింసా నేచురల్స్ లిమిటెడ్ 1990 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ కంపెనీ కెఫిన్ అన్‌హైడ్రస్ అండ్ గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ క్రూడ్ కెఫిన్ తయారీలో కొనసాగుతుంది. దీనితో పాటు కంపెనీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ వ్యాపారం కూడా చేస్తుంది. ఈ కంపెనీ ఉత్పత్తులను అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, బ్రిటన్, థాయిలాండ్ మొదలైన దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. ఈ కంపెనీ ఉత్పత్తులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్ల ఆహారం, పానీయాలు, న్యూట్రాస్యూటికల్, కాస్మెటిక్స్ అండ్ ఫార్మసుటికల్స్ పరిశ్రమలలో ఉపయోగించబడుతున్నాయి. 30 సెప్టెంబర్ 2024 నాటికి కంపెనీ 2024, 2023 అలాగే 2022 సంవత్సరాలలో ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రూ.3530.91 లక్షలు, రూ.7,463 లక్షలు ఇంకా రూ.9,988 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది.
IPO రిజర్వేషన్: పబ్లిక్ ఇష్యూలో దాదాపు 50% అర్హత ఉన్న ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, దాదాపు 35% రిటైల్ పెట్టుబడిదారులకు ఇంకా మిగిలిన 15% నాన్ ఇన్స్టిట్యూషనల్ పెట్టుబడిదారులకు కేటాయించింది.
కంపెనీ IPO ఫండ్స్ ఎక్కడ ఉపయోగిస్తుంది: ఈ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్ కంపెనీ శ్రీ అహింసా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (SAHPL)లో పెట్టుబడి పెట్టడానికి, రాజస్థాన్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఇంకా సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలను కోసం ఉపయోగిస్తుంది.


Click it and Unblock the Notifications