ఒక కంపెనీ మొదటిసారిగా షేర్స్ సాధారణ ప్రజలకు జారీ చేసినప్పుడు దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు అంటే ఐపిఒ. కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అలాగే వాటి ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి IPOలను ఆశ్రయిస్తాయి. మార్కెట్ నుండి లోన్ తీసుకోవడానికి బదులుగా చాలా కంపెనీలు కొన్ని వాటాలను ప్రజలకు అమ్మడం ద్వారా లేదా కొత్త షేర్స్ జారీ చేయడం ద్వారా డబ్బును సేకరిస్తాయి. అయితే త్వరలో మీకు క్రిజాక్ లిమిటెడ్ IPOలో పెట్టుబడి పెట్టే అవకాశం లభించనుంది. ఎందుకంటే ఈ కంపెనీ IPOను SEBI ఆమోదించింది.

క్రిజాక్ లిమిటెడ్ IPO (Crizac Limited IPO) కు సెబీ ఆమోదం
క్రిజాక్ లిమిటెడ్ రూ.1,000 కోట్ల విలువైన ఐపిఓకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుండి ఆమోదం పొందింది. ఈ ఇష్యూ పూర్తిగా OFS రూపంలో ఉంది. పింకీ అగర్వాల్ రూ.841 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయిస్తుండగా, మనీష్ అగర్వాల్ రూ.159 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను OFS ద్వారా విక్రయిస్తారు. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం, ఇందులో ఎటువంటి కొత్త ఇష్యూలు ఉండవు.
కంపెనీ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్
ఈక్విరస్ క్యాపిటల్ అలాగే ఆనంద్ రతి అడ్వైజర్స్ ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. రూ.2 పేస్ వాల్యూ ఉన్న IPOలో రూ.1,000 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది.
కంపెనీ గురించి వివరాలు: కోల్‌కతాకు చెందిన క్రిజాక్ లిమిటెడ్ యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ (ANZ)లలో ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ రిక్రూట్మెంట్ సొల్యూషన్ అందిస్తుంది. ఈ కంపెనీ ఇప్పటివరకు 3.82 లక్షలకు పైగా అప్లికేషన్స్ ప్రాసెస్ చేసింది. దీనితో పాటు, 140కి పైగా ప్రపంచ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం చేసుకుంది.
మార్చి 2024లో IPO కోసం crizac SEBIకి డాకుమెంట్స్ సమర్పించింది. సెబీ వాటిని జూలైలో తిరిగి ఇచ్చింది. దీని తరువాత కంపెనీ మళ్ళీ నవంబర్ 2024లో డాకుమెంట్స్ సమర్పించింది, ఆ తరువాత SEBI 4 మార్చి 2025న ఒక పరిశీలన లేఖను జారీ చేసింది. అంటే ఇప్పుడు కంపెనీకి IPO తీసుకురావడానికి అనుమతి లభించింది. క్రిజాక్ లిమిటెడ్ కంపెనీ ఆర్థిక పర్ఫార్మెన్స్: FY23లో క్రిజాక్ ఆపరేషనల్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 79.5 శాతం పెరిగి రూ.472.97 కోట్లకు చేరుకుంది, అయితే గత సంవత్సరం రూ.263.53 కోట్లుగా ఉంది. అంతే కాకుండా పన్ను తర్వాత లాభం (PAT) 65.50 శాతం పెరిగి రూ.67.76 కోట్ల నుండి రూ.112.14 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో IPO పండగ.. రూ. 10 వేల కోట్ల టార్గెట్తో వస్తున్న ఆరు బడా కంపెనీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications