భారత్‌లో బుల్లెట్ ట్రైన్ విప్లవం: కొత్త రూట్లు, లాంచ్ డేట్స్ , రియల్ ఎస్టేట్‌పై మైండ్ బ్లోయింగ్ ఇంపాక్ట్!

భారతదేశ రవాణా రంగం త్వరలోనే ఒక సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ 'షింకన్సెన్' (Shinkansen) సాంకేతికత ఆధారంగా దేశంలో హైస్పీడ్ రైలు కారిడార్లు, అంటే మనందరం ఆశగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ (bullet train) ప్రాజెక్టులు వేగంగా రూపుదిట్టుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడమే కాక, కనెక్ట్ అయ్యే నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లను పూర్తిగా రీషేప్ చేయబోతున్నాయి.

దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అయిన 'ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్' నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. దీనితో పాటు, దేశంలోని ప్రధాన ఆర్థిక హబ్దలను కలుపుతూ మరో 4,000 కిలోమీటర్లకు పైగా పొడవైన కొత్త హైస్పీడ్ రూట్లను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.

Upcoming Bullet Trains in India routes launch dates real estate impact bullet train

దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్: ముంబై-అహ్మదాబాద్ కారిడార్ (MAHSR)

ఇది భారతదేశంలోనే అత్యంత అధునాతనమైన, మొదటి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్. మహారాష్ట్ర, గుజరాత్‌లలోని కీలక పారిశ్రామిక నగరాలను ఇది అనుసంధానిస్తుంది.

ముఖ్యమైన హైలైట్స్..

  • మొత్తం రూట్ పొడవు: 508 కిలోమీటర్లు
  • గరిష్ట వేగం: గంటకు 320 కిలోమీటర్లు
  • మొత్తం స్టేషన్లు: 12 (ముంబై BKC, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి)
  • బుల్లెట్ ట్రైన్ ప్రయాణ సమయం: 2 గంటల 7 నిమిషాలు (డైరెక్ట్ సర్వీస్)
  • ప్రస్తుత ప్రయాణ సమయం: రైలులో 7-8 గంటలు, రోడ్డు మార్గంలో 9-10 గంటలు.

ఈ ప్రాజెక్టులో అత్యంత అద్భుతమైన ఇంజనీరింగ్ విశేషం ఏమిటంటే.. ముంబై సమీపంలో నిర్మిస్తున్న 21 కిలోమీటర్ల పొడవైన టన్నెల్. ఇందులో 7 కిలోమీటర్ల మేర థానే క్రీక్ సముద్రం అడుగు భాగం (Underwater) నుండి ఈ రైలు ప్రయాణిస్తుంది.

ఎప్పుడు ప్రారంభమవుతుంది? (Timeline)

ఈ ప్రాజెక్టును విడతల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు..

  • ఫేజ్ 1 (ట్రయల్ రన్స్): సూరత్ నుండి వాపి సెక్షన్ మధ్య మొదటి ట్రయల్ రన్ 2026 లో ప్రారంభం కానుంది.
  • ఫేజ్ 2 (ప్రయాణికులకు ప్రారంభం): ఈ కారిడార్‌లోని ఒక నిర్దిష్ట సెక్షన్‌లో మొదటి ప్యాసింజర్ సర్వీసులు ఆగస్టు 2027 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
  • ఫేజ్ 3 (పూర్తి కారిడార్): ముంబైలోని అండర్‌గ్రౌండ్ పనులతో కలిపి పూర్తి ముంబై-అహ్మదాబాద్ రూట్ 2029 నాటికి వంద శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సమయం ఎంత ఆదా అవుతుంది?

ప్రస్తుతం ఒక ప్రయాణికుడు ముంబై నుండి అహ్మదాబాద్‌కు సాధారణ రైలులో వెళ్లడానికి 8 గంటలు పడుతుందని అనుకుంటే, బుల్లెట్ ట్రైన్ ద్వారా అది 2.1 గంటలకు తగ్గుతుంది. అంటే ప్రతి ట్రిప్‌కు దాదాపు 5.9 గంటల సమయం ఆదా అవుతుంది. అంటే ఏడాదికి దాదాపు 12 పూర్తి రోజులు

ప్రయాణ సమయం ఆదా అవుతుంది!

రాబోయే ఇతర బుల్లెట్ ట్రైన్ రూట్లు (ప్రయాణ సమయాల వివరాలు)
ముంబై-అహ్మదాబాద్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా మరికొన్ని భారీ రూట్లను కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ లబ్ధి చేకూరనుంది. రాబోయే కారిడార్ల ప్రయాణ సమయాల వివరాలు ఇలా ఉన్నాయి..

  • బెంగళూరు - హైదరాబాద్ రూట్: ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 8 నుండి 10 గంటల సమయం పడుతుండగా, బుల్లెట్ ట్రైన్ ద్వారా కేవలం సుమారు 2 గంటల్లోనే చేరుకోవచ్చు.
  • చెన్నై - హైదరాబాద్ రూట్: ప్రస్తుతం 10 నుండి 12 గంటల సమయం పడుతున్న ఈ ప్రయాణాన్ని, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే సుమారు 2 గంటల 55 నిమిషాలకు తగ్గించవచ్చు.
  • పుణే - హైదరాబాద్ రూట్: ప్రస్తుతం దాదాపు 12 గంటలు పడుతుండగా, భవిష్యత్తులో ఈ ప్రయాణ సమయం సుమారు 1 గంట 55 నిమిషాలు మాత్రమే అవుతుంది.
  • చెన్నై - బెంగళూరు రూట్: ప్రస్తుతం 5 నుండి 6 గంటల సమయం పడుతుండగా, బుల్లెట్ ట్రైన్ ద్వారా సుమారు 1 గంట 13 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు.
  • ఢిల్లీ - వారణాసి రూట్: ప్రస్తుతం 8 నుండి 10 గంటల సమయం పడుతున్న ప్రయాణం, రాబోయే రోజుల్లో సుమారు 3 గంటల 50 నిమిషాలకు తగ్గిపోనుంది.
  • ముంబై - పుణే రూట్: ప్రస్తుతం రోడ్డు లేదా రైలు మార్గంలో 3 నుండి 4 గంటల సమయం పడుతుండగా, హైస్పీడ్ రైలు ద్వారా కేవలం సుమారు 48 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
  • వారణాసి - సిలిగురి రూట్: ఈ రూట్‌లో బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం సుమారు 2 గంటల 55 నిమిషాలు అవుతుంది.

రియల్ ఎస్టేట్ రంగంపై బుల్లెట్ ఇంపాక్ట్!

గతంలో మెట్రో రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు వచ్చినప్పుడు వాటి చుట్టుపక్కల భూముల ధరలు ఎలా పెరిగాయో మనకు తెలుసు. బుల్లెట్ ట్రైన్ రాకతో ఈ ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉండబోతోంది.

  1. చిన్న నగరాల వృద్ధి: సూరత్, వడోదర, వాపి, బోయిసర్ వంటి నగరాల్లో ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఉదాహరణకు, బోయిసర్ నుండి ముంబైకి కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చంటే.. ముంబైలో ఖరీదైన ఇళ్లు కొనలేని వారు బోయిసర్‌లో ఉండటానికి మొగ్గు చూపుతా రు.
  2. స్టేషన్ల చుట్టూ 20% పైగా ధరల పెరుగుదల: బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌కు 5-10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాపర్టీల విలువ ఊహించని విధంగా పెరుగుతుంది. ప్రయాణ సౌకర్యం పెరగడం వల్ల ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు వేగంగా వెలుస్తాయి.
  3. కమర్షియల్ హబ్‌ల విస్తరణ: ముంబై వంటి నగరాల్లో ఆఫీస్ అద్దెలు భరించలేని కంపెనీలు.. బుల్లెట్ కనెక్టివిటీ ఉన్న సూరత్, వడోదర వంటి నగరాల్లో ఐటీ పార్కులు, కార్పొరేట్ ఆఫీసులను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి.
  4. ట్రాన్సిట్-ఓరియెంటెడ్ కమ్యూనిటీలు: జపాన్ తరహాలోనే భారతదేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ స్టేషన్ల వద్దే మెట్రో కనెక్టివిటీ, బస్ టెర్మినల్స్, ఫైవ్ స్టార్ హోటళ్లు, మాల్స్ , బిజినెస్ సెంటర్లను ఒకే హబ్‌గా (Integrated Hubs) అభివృద్ధి చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+