UP News: సామాన్యుడు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తోంది. ఇందుకు గాను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరిట్ గత కొన్నేళ్లుగా ప్రజలు పక్కా గృహాలు నిర్మించుకునేందుకు సాయం చేస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఆ ఇంటి యజమానురాలి ఖాతాలో ఈ నిధులు జమ చేసేలా నిర్ణయం తీసుకుంది. ఇక్కడే ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.
ఉత్తరప్రదేశ్‌లోని 11 మంది మహిళలు భర్తలను విడిచిపెట్టి తమ ప్రియుళ్లతో పారిపోయినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం మొదటి విడతగా 40 వేల నగదు అందుకున్న తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి కాదని వెల్లడించింది. గతంలోనూ PMAY సొమ్ము 50 వేలు అందుకొని బారాబంకి జిల్లాకు చెందిన నలుగురు మహిళలు ప్రేమికులతో వెళ్లిపోయినట్లు పేర్కొంది.

ఈ అనుకోని ఘటనతో షాక్ అయిన ఆ మహిళల భర్తలు PMAYకి సంబంధించి తదుపరి విడతల మొత్తాన్ని సదరు మహిళల ఖాతాల్లో పడకుండా నిరోధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు అధికారులు వారి ఖాతాలకు భవిష్యత్ వాయిదాల సొమ్ము విడుదల కాకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. PMAY నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన డబ్బును దారి మళ్లిస్తే సంబంధిత వ్యక్తి నుంచి ప్రభుత్వం తిరిగి వసూలు చేసుకోవచ్చు. కాగా ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
ఇది జరిగిన మహారాజ్‌గంజ్ నిచ్లాల్ బ్లాక్‌లోని 108 గ్రామాల నుంచి 2023-24లో 2 వేల 350 మంది లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. జిల్లాలో 90 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు నివేదిక పేర్కొంది. త్వరలోనే మిగిలిన 10 శాతాన్ని కూడా పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications