బడ్జెట్ ఎఫెక్ట్, మార్కెట్ పరుగు: భారీ లాభాలకు ప్రాఫిట్ బుకింగ్ దెబ్బ
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. బడ్జెట్‌కు ముందు ఆరు సెషన్‌లలోని నష్టానికి మించి కేవలం ఈ రెండు రోజుల్లోనే వచ్చేసింది. నిన్న 2300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ నేటి ఉదయం కూడా 1500 పాయింట్లకు పైగా లాభాల్లోకి వచ్చింది. నిఫ్టీ నిన్న 646 పాయింట్లు లాభపడగా, నేడు 400 పాయింట్ల మేర ఎగిసింది. బడ్జెట్ ఉత్సాహంతో ఆల్ టైం గరిష్టాన్ని తాకాయి. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంకు సూచీ 34000 మార్కును దాటింది. 3 శాతానికి పైగా లాభపడింది.

ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్
సెన్సెక్స్ ఉదయం గం.9.16 సమయానికి 734.26 పాయింట్లు లేదా 1.51% లాభపడి 49334.87 వద్ద, నిఫ్టీ 220.70 పాయింట్లు లేదా 1.55% లాభపడి 14501.90 వద్ద కనిపించింది. 1027 షేర్లు లాభాల్లో, 171 షేర్లు నష్టాల్లో ముగియగా, 46 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఓ సమయంలో 1500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ ఆ తర్వాత ఉదయం గం.10.30 సమయానికి 1000 పాయింట్ల లాభాల్లో ఉంది. నిఫ్టీ కూడా దాదాపు 500 పాయింట్లు ఎగిసినప్పటికీ, ఆ తర్వాత 280 పాయింట్ల లాభం వద్ద ఉంది. మార్కెట్లు నిన్న భారీగా లాభపడ్డాయి. నేడు ఉదయం కాసేపు కూడా అదే ఒరవడి కొనసాగింది. అయితే కాస్త ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో మార్కెట్లు ఉదయం లాభాల నుండి కాస్త వెనక్కి తగ్గాయి. డాలర్ మారకంతో రూపాయి ఫ్లాట్‌గా 73.02 వద్ద ప్రారంభమైంది. గత వారం చివరి సెషన్ శుక్రవారం 72.95 వద్ద క్లోజ్ కాగా, నిన్న 73.02 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 8.01 శాతం, లార్సన్ 6.05 శాతం, HDFC 5.03 శాతం, HDFC బ్యాంకు 5.02 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 4.84 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హీరోమోటో కార్ప్ 1.28 శాతం, రిలయన్స్ 1.18 శాతం, HDFC లైఫ్ 1.07 శాతం, హెచ్‌యూఎల్ 0.68 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.83 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, లార్సన్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.83 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.85 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 2.99 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.46 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.82 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.02 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.45 శాతం, నిఫ్టీ ఐటీ 0.93 శాతం, నిఫ్టీ మీడియా 0.25 శాతం, నిఫ్టీ మెటల్ 0.31 శాతం, నిఫ్టీ ఫార్మా 0.84 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.64 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.38 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.03 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications