ఎతైన అపార్టుమెంట్లలో ఉండటం అంటే అంత ఈజీ కాదు... ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు కట్టడానికి బదులు అపార్టుమెంట్లలో ఫ్లాట్ కొనడానికీ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే అపార్టుమెంట్లలో ఫ్లాట్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుందో అందుకు తగ్గట్టుగానే మెయింటెనెన్స్ ఖర్చు కూడా అవుతుందనేది నిజం. ఇందుకు నిదర్శం ఈ సంఘటనే.

ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ 1లోని ప్రెస్టీజ్ సన్‌రైజ్ పార్క్ అపార్ట్‌మెంట్లలో ఉండే ఓ వ్యక్తి తన ఫ్లాట్ బయట షూ రాక్ పెట్టుకున్నందుకు రోజుకు రూ.100 జరిమానా కడుతున్నాడట. ఇది వినడానికి వింతగా అనిపించినా అక్షరాలా నిజం. వెయ్యికి పైగా ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో సాధారణ కారిడార్లలో షూ రాక్‌లు, పులా మొక్కల కుండీలు వంటి ఇతర వస్తువులను తొలగించాలని రెసిడెంట్స్ అసోసియేషన్ తాజాగా ఒక కఠిన నిబంధన అమలు చేసింది. దింతో దాదాపు 50% మంది ఫ్లాట్ ఓనర్లు ఈ రూల్ ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు.
అయితే ఇందుకు రెసిడెంట్స్ అసోసియేషన్ మొదట నోటీసులు పంపి ఫ్లాట్ ఓనర్లతో మాట్లాడి రెండు నెలల గడువు కూడా ఇచ్చింది. మొదట్లో ఈ నిబంధన పై వ్యతిరేకత వచ్చినా, తరువాత మాత్రం చాలా మంది నిబంధనలకు కట్టుబడి వాళ్ళ వస్తువులను తొలగించారు. కానీ సుమారు నాలుగు వారాలు గడిచిన కూడా ఇద్దరు ఫ్లాట్ ఓనర్లు మాత్రం వాళ్ళ వస్తువులను అలాగే కారిడార్లో ఉంచారు. వీరిలో ఒకరికి అసోసియేషన్ పదే పదే గుర్తు చేసిన తర్వాత తొలగించగ, కానీ రెండో వ్యక్తి మాత్రం మొండిగా తన షూ రాక్‌ను బయటే ఉంచాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫ్లాట్ ఓనర్ ముందుగానే రూ.15 వేల జరిమానా కట్టి భవిష్యత్తులో విధించే జరిమానాలకు కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోమని, తనను ఇబ్బంది పెట్టవద్దని కోరాడు. జరిమానాలు పెరుగుతున్న కొద్దీ ఫ్లాట్ ఓనర్ షూ రాక్ తీయడానికి నిరాకరిస్తూ జరిమానా కడుతూనే ఉన్నాడు.
"గత ఎనిమిది నెలల్లో అతను 24 వేల జరిమానా కట్టాడు," అని అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ ప్రసాద్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కి తెలిపారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి అసోసియేషన్ ఇప్పుడు ప్రతిరోజు జరిమానా రూ.100 నుండి రూ.200కి పెంచాలని యోచిస్తోంది. ఈ రూల్ పెట్టడానికి అసలు కారణం ఏంటంటే ఎత్తైన భవనాల్లోని కారిడార్లు అత్యవసర సమయాల్లో సురక్షితంగా బయటకు వెళ్ళడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలని అగ్నిమాపక భద్రతా నిబంధనలు చెబుతున్నాయి. అందుకే ఈ కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications