Nitin Gadkari: పంజాబ్ సీఎంకు నితిన్ గడ్కరీ లేఖ.. రూ.4,000 కోట్ల ప్రాజెక్టు రద్దవుతుందా..!
ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడకపోతే పంజాబ్‌లో సుమారు రూ. 14,288 కోట్ల విలువైన ఎనిమిది ప్రధాన రహదారుల ప్రాజెక్టులను రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తెలిపింది. ఈ మేరకు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో జరుగుతున్న హింస, బెదిరింపుల గురించి ఆందోళనకరమైన నివేదికలు వస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
పంజాబ్ లోని జలంధర్‌లో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు, అలాగే లూథియానాలో ప్రాజెక్ట్ సిబ్బందిన బెదిరించడం, సౌకర్యాలు లేకుండా చేయడం వంటివి చేస్తున్నారు.ఈ ప్రాజెక్టులు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌లని గడ్కరీ నొక్కిచెప్పారు. ఒక్క ప్యాకేజీని కూడా రద్దు చేయడం వల్ల సాగే మొత్తం పనికిరాకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి.. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, కాంట్రాక్టర్లు, వారి బృందాలను ప్రభావితం చేసే తీవ్రమైన భద్రతా సమస్యలను, అలాగే కొనసాగుతున్న భూసేకరణ సవాళ్లను వివరించారు.

పంజాబ్ లోని పరిస్థితి నొక్కిచెప్పడానికి అతను ఇటీవలి దాడులకు సంబంధించిన ఫోటోగ్రాఫిక్ ఫోటోలన జతపరిచారు. జులై 15న జరిగిన సమీక్షా సమావేశంలో భూసేకరణ, చట్టాల అమలుకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యతనిస్తామని గడ్కరీకి వాటాదారుల నుంచి హామీ లభించింది. అయినప్పటికీ, అతను తన నిరాశను వ్యక్తం చేశారు. "ఏ పురోగతి లేదు, పరిస్థితి మరింత దిగజారింది" అని పేర్కొన్నారు. అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ వ్యవహారాలు, శాంతిభద్రతలు క్షీణిస్తున్నందున, అనేక మంది గుత్తేదారులు తమ ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్ల తెలిపారు.
NHAIకి వ్యతిరేకంగా క్లెయిమ్‌లను లేవనెత్తారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా, భూమి లభ్యత సవాళ్ల కారణంగా NHAI ఇప్పటికే రూ. 3,263 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను రద్దు చేసింది. ఈ ఏడాది జనవరిలో పంజాబ్‌లో 29 హైవే ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల విలువ రూ.4,000 కోట్లు.


Click it and Unblock the Notifications