Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేది అప్పుడే..!
ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో ఇరాన్ హర్మూజ్ జల సంధిని మూసివేసింది. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఇండియాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మిగతా దేశాలతో పోలిస్తే కాస్త ఆలస్యంగానే ధరలు పెంచారు. దీంతో యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాలు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ను కోరాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఫైనల్ అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగింది.
అమెరికా ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. అటు ఇరాన్ కూడా హర్మూజ్ జల సంధిని ఓపెన్ చేసింది. దీంతో ముడి చమురు నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముడి చమురు ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి త్రి హర్దీప్ సింగ్ పూరీని ప్రశ్నించారు. రాబోయే కొన్ని వారాల పాటు చమురు ధరలు తక్కువగానే ఉంటే ఆ ప్రశ్న సమంజసంగా ఉంటుందని పూరీ అన్నారు. చమురు ధర తగ్గే వరకు దేశీయ ఆయిల్ కంపెనీలు కొనుగోలు వ్యయం కంటే తక్కువ పెట్రోల్, డీజిల్ విక్రయించారని గుర్తు చేశారు.

చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 30 నాటికి రూ. 74,781 కోట్ల నష్టాన్ని చవిచూశాయని వివరించారు. ప్రస్తుతం 2 నెలల క్రితం కొనుగోలు చేసిన ముడి చమురు నిల్వలను వినియోగిస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఈ ధరల తగ్గుదల మరో 2-3 నెలల పాటు కొనసాగితే అప్పుడు అప్పుడు ధరల తగ్గుదలపై ఆలోచించవచ్చని అన్నారు. చాలా దేశాల్లో పెట్రోల్ ధర సుమారు 20 శాతం పెరిగిందన్నారు. సంక్షోభ సమయంలో భారతదేశంలో పెట్రోల్ ధర కేవలం 5.58% మాత్రమే పెరిగిందని మంత్రి గుర్తుచేశారు.
ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ 'నయారా ఎనర్జీ' జూలై 1 నుంచి తన రిటైల్ నెట్‌వర్క్ అంతటా పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 చొప్పున తగ్గించింది. ముడి చమురు ధరలు తగ్గడం ప్రారంభమైన తర్వాత రిటైల్ ఇంధన ధరలలో జరిగిన మొదటి ప్రధాన తగ్గింపు ఇదే. అయితే ముడి చమురు ధర పెరిగినప్పుడు ఇదే స్థాయిలో నయారా సంస్థ ధరలు పెంచింది. సంక్షోభ సమయంలో నయారా పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5 మేర పెంచింది కాబట్టే ఇప్పుడు తగ్గించింది.


Click it and Unblock the Notifications