SVB Collapse: అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏం జరిగినా అది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో పెద్దన్న అమెరికా 2008 సంక్షోభం తర్వాత మరో బ్యాంకింగ్ సంక్షోభాన్ని తెరమీదకు తెచ్చింది. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ కుప్పకూలటం.. భారత బ్యాంకింగ్ మూలాల పటిష్ఠతపై కూడా ఆందోళనలు కలిగిస్తోంది.

దిద్దుబాటు చర్యలు..
కేవలం రెండు రోజుల్లో బ్యాంక్ స్టాక్ 85 శాతం పడిపోవటంతో ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు 45 రోజుల జీతాన్ని చెల్లిస్తామని ఆఫర్ చేసింది. దీని ద్వారా బ్యాంక్ ఉద్యోగులు బయటకు వెళ్లిపోకుండా కాపాడాలని నిర్ణయించింది.
2022 చివరి నాటికి బ్యాంక్ మెుత్తంగా 8,528 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయం, కాలిఫోర్నియా, మసాచుసెట్స్‌లోని 17 శాఖలు సోమవారం తిరిగి తెరవబడతాయని FDIC ప్రకటించింది.
స్పందించిన కేంద్ర మంత్రి..
ఎస్వీబీ సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ కంపెనీలతో పాటు బ్యాంకులను సైతం కుదిపేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంతి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలోని స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను తాను కలుస్తానని వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్ కంపెనీలు చాలా కీలకమన్న ఆయన.. ఈ సంక్షోభం నుంచి అంకురాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయగలదనే విషయాలపై ప్రతినిధులతో చర్చించనున్నట్లు తెలిపారు.
ముంబై ప్రజల ఆందోళన..
అమెరికాలో బ్యాంక్ కుప్పకూలటంపై ఇండియాలోని ముంబై ప్రజలు ఆందోళన చెందటం గమనార్హం. దీనికి కారణం అమెరికాలోని బ్యాంక్ పేరు SVC బ్యాంక్ అయితే ఇదే పేరుతో ముంబైలోనూ ఒక బ్యాంక్ ఉంది. అయితే ముంబైలో ఉన్న బ్యాంక్ పూర్తి పేరు శ్యాంరావు విఠల్ కోఆపరేటివ్ బ్యాంక్. దీనిని దాదాపు 116 ఏళ్ల కిందట ప్రారంభించటం జరిగింది.
అయితే SVC బ్యాంక్ కుప్పకూలిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తికమకపడిన కొందరు కస్టమర్లు బ్యాంకుకు ఫోన్ చేశారు. బలమైన సహకార బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న ఇది దివాలా తీసినట్లు వారు భావించిన కొందరు ముంబై ప్రజలు ఆందోళన చెందారు.


Click it and Unblock the Notifications