Gas Cylinder: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. ఎప్పటి నుంచి అంటే..
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్‌లతో వస్తాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సిలిండర్లకు క్యూఆర్ కోడ్ చర్చ కొనసాగుతోందని చెప్పారు. క్యూఆర్ కోడ్ ఇవ్వడం వల్ల సిలిండర్ల సరఫరాలో అవకతవకలు తగ్గుతాయని అన్నారు.అంతేకాకుండా వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్, ట్రేసింగ్, ఇన్వెంటరీ నిర్వహణను మెరుగుపరచడంలో సహాయపడతాయని వివరించారు.
సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదా గ్యాస్ సిలిండర్ రూల్స్ (జిసిఆర్)లో పొందుపరిచినట్లు వివరించారు. తుది నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుందని వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి తెలిపారు. పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (PESO) పనితీరులో సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పెట్రోలియం, పేలుడు పదార్థాలు, బాణసంచా, ఇతర సంబంధిత పరిశ్రమల ప్రముఖుల నుంచి అభిప్రాయాలను కోరేందుకు బుధవారం దేశ రాజధానిలో జరిగిన వాటాదారుల సంప్రదింపులలో మంత్రి ఈ ప్రకటన చేశారు.

ఈ సమావేశాన్ని పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) ఏర్పాటు చేసింది. డీపీఐఐటీ కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. సమావేశంలో గోయల్ PESO ద్వారా మంజూరు చేయబడిన లైసెన్సుల కోసం లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80% మరియు MSMEలకు 50% రాయితీని ప్రకటించారు.
30-50 లోపు నివాసం ఉన్న సందర్భాల్లో పెట్రోల్ పంపుల రిటైల్ అవుట్‌లెట్లు పనిచేసేలా భద్రతా చర్యల నమూనాను రూపొందించడానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB), పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖతో సంప్రదించి మార్గదర్శకాలను రూపొందించాలని PESOని ఆదేశించారు. పెసో మంజూరు చేసిన లైసెన్స్‌ల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్‌ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు పీయూష్ తెలిపారు.


Click it and Unblock the Notifications