RBI Vs Piyush Goyal: వడ్డీ రేట్లు తగ్గించాలన్న గోయల్.. వ్యాపారులకు కీలక సూచన: దాస్ ఏమన్నారంటే
RBI Rate Cuts: ఒకపక్క అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వరుసగా తన వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉంది. అయితే ఇండియాలో రిజర్వు బ్యాంక్ మాత్రం రేట్లను తగ్గించకుండా యథాతథంగా కొనసాగించటంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వు బ్యాంక్ ఖచ్చితంగా తన వడ్డీ రేట్లను తగ్గించాల్సిందేనని తాజాగా నవంబర్ 14న పేర్కొన్నారు.
ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని రేట్లను తగ్గించడంపై ఎంపిక చేసుకోవడం లోపభూయిష్టమైన సిద్ధాంతంగా గోయల్ పేర్కొన్నారు. అలాగే డిసెంబర్ నాటికి ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం అత్యల్పంగా ఉందని గోయల్ CNBC-TV18 గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పేర్కొన్నారు. ఇదే క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వెళ్లిపోవటంపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేశీయ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహంతో మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని క్వార్టర్లీ చిత్రాన్ని చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు.

కూరగాయల ధరలు భారీగా పెరగటంతో ఇండియాలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో వడ్డీ రేట్లను తగ్గించాలనే డిమాండ్ సర్వత్రా పెరుగుతోంది. అయితే పీయూష్ గోయల్ చేసిన కామెంట్లపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తాజాగా స్పందించారు. ఖచ్చితంగా వడ్డీ రేట్లను తగ్గించాలి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం చెప్పిన కొద్ది క్షణాల తర్వాత దాస్ ఇలా పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంకర్లకు అనేక సవాళ్లు ఉంటాయని, "ఒకవైపు చాలా తక్కువ లేదా చాలా ఆలస్యంగా చేయడం, మరోవైపు చాలా ఎక్కువ లేదా చాలా తొందరగా చేయడం" అనే సమస్యలు తమకు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయని దాస్ పేర్కొన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో జరిగే ద్రవ్యవిధాన సమీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయాన్ని మాత్రం ప్రస్థావించలేదు.
ఇదే క్రమంలో పీయూష్ గోయల్ కార్పొరేట్ కంపెనీలకు సైతం కీలక విజ్ఞప్తి చేశారు. మార్కెట్లో ప్రస్తుతం ప్రజల నుంచి వస్తువులు సేవలకు డిమాండ్ తగ్గినందున ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసగుతోంది. ఈ క్రమంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు లాభాల మార్జిన్ కంటే పోటీతత్వంతో కూడిన రేట్లకు వస్తువులను విక్రయించాలని సూచించారు. ఈ క్రమంలో ఇటీవల మార్కెట్లో లిస్ట్ అయిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియాను ఉద్ధేశించి మాట్లాడుతూ కంపెనీ నికర లాభం 9-10 శాతం మధ్య ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో మంత్రి కంపెనీ పేరును మాత్రం ప్రస్థావించలేదు. 25 ఏళ్ల కిందట కంపెనీ ఇండియాలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించిందని, ఈ క్రమంలో 12 బిలియన్ డాలర్ల మేర డివిడెండ్లు, రాయల్టీల రూపంలో చెల్లించిందన్నారు. ప్రస్తుతం కంపెనీ విలువ 15 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications