ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే విధంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు.
దేశీయ వినియోగంతో పాటు పత్తి ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఉత్పత్తి అవుతున్న పత్తి తో పాటు వస్త్రాల్లోనూ అధిక నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10-11 టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నట్లు ప్రకటించారు. కేంద్ర జౌళి, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈమేరకు వివరాలను వెల్లడించారు.

'టెక్స్‌టైల్, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో చర్చించాను. హైక్వాలిటీ కాటన్ మరియు టెక్స్‌టైల్ టెస్టింగ్ లేబొరేటరీల ఏర్పాటు కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)తో కలిసి వారు పని చేస్తున్నారు. మరో 15 రోజుల్లో సుమారు 6-7 మిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా ప్రయోగశాలలను ఆమోదిస్తాము' అని కేంద్ర మంత్రి తెలిపారు.
ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ (ICAC) 81వ ప్లీనరీ సమావేశంలో గోయల్ ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో 11 అత్యాధునిక ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. టెక్స్‌టైల్ రీసెర్చ్ అసోసియేషన్‌ల వద్ద 7, పత్తి పండించే ప్రాంతాల్లో మరో 4 ల్యాబ్స్ నెలకొల్పి.. దేశం మొత్తాన్ని కవర్ చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన వస్త్రాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రైవేట్ రంగానికి, రైతులకు మద్దతు ఇవ్వడానికి ఈ ప్రయోగశాలల ఏర్పాటు కోసం కేంద్రం 100 శాతం నిధులు సమకూరుస్తుంది. తద్వారా నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేయవచ్చని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో 100 శాతం ట్రేస్‌బిలిటీ మరియు ధ్రువీకరణ కలిగిన ప్రీమియం పత్తి బ్రాండ్ 'కస్తూరి కాటన్ భారత్'ను మంత్రి ప్రారంభించారు. భవిష్యత్తులో ఇది ప్రపంచస్థాయి నాణ్యతకు చిహ్నంగా మారుతుందని ఆశిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications