Rajan vs Nirmalamma: రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఓ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా తన బాధ్యతలను నిర్వర్తించడంలో రఘురామ్ రాజన్ విఫలమయ్యారని నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో పడిందన్నారు. ఓపక్క బ్యాంకులు ఇబ్బందుల్లో ఉంటే.. ఆ సమయంలో నియంత్రణ సంస్థ RBI పక్క చూపు చూసినట్లు పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను గాడిలో పెట్టడంపై ఆయన శ్రద్ధ చూపలేదన్నారు.

రాజన్ బ్యాంకింగ్ రంగంపై కాకుండా మరెక్కడో దృష్టి పెట్టారని ఆర్థిక మంత్రి ఆరోపించారు. బాహ్య ఒత్తిడిని ఎదుర్కొనేందుకు బ్యాంకులు కృషి చేస్తున్నాయని.. ఈ విషయంలో వాటిని గైడ్ చేస్తూ నిబంధనల గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ఇది చేయడంలో ఆయన విఫలమయ్యారంటూ ఓ ప్రైవేట్ ఛానెల్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో చెప్పుకొచ్చారు.
ఆయన మాట్లాడే ప్రతిసారీ ఆర్థికవేత్తగానా లేదా టోపీ ధరించిన రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా అనేది మొదట స్పష్టం చేయాలన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే 9 నుంచి 10 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలని రఘురామ్ రాజన్ కొద్ది రోజుల క్రితం సూచించారు. దానిపై నిర్మలా సీతారామన్ ఇలా కౌంటర్ ఇచ్చినట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications