Tur Dal: ఏపీ, తెలంగాణ రైతులకు శుభవార్త.. కందులు కొనుగోలుకు ప్రత్యేక పోర్టల్.. ప్రయోజనాలివే..
Tur Dal News: సాగు నష్టాలతో సతమతమౌతూ పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రకృతి సైతం కరువుకు కారణంగా మారుతోంది.
ఇలాంటి తరుణంలో దేశంలోని రైతుల సంక్షేమం కోసం బీజేపీ సర్కార్ పెద్ద శుభవార్త చెప్పింది. కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా కందులు కొనుగోలు పోర్టల్‌ను ప్రారంభించారు. డిసెంబర్ 2027 నాటికి భారత్ పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ పోర్టల్ అనేక ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచబడింది. పోర్టల్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక రాష్ట్రాల్లోని రైతులకు ప్రయోజనకరంగా ఉండనుంది. ఇది క్రయవిక్రయాలను సులభతరం చేయనుంది.

పోర్టల్ ద్వారా రైతులు నేరుగా తమ పంటను విక్రయించుకునేందుకు సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా విక్రయాలు చేసి నేరుగా బ్యాంక్ ఖాతాలోకే రైతులు డబ్బును పొందగలరు. ఇప్పుడు రైతులు తాము పండించిన సరుకును అమ్ముకునేందుకు దగ్గరలోని మార్కెట్లకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పైగా దళారులు, వ్యాపారులు తక్కువ రేట్లకు వీరి నుంచి సరుకును కొనుగోలు చేయటంతో రైతులు నష్టపోతున్నారు. తాజా చర్య ద్వారా రైతులు కందులను నేరుగా విక్రయించి సరైన ధరను పొందటం ద్వారా లాభాలను అందుకునే అవకాశాలు పెరగనున్నాయి.
ప్రభుత్వం ప్రస్తుతం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(NAFED), నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(NCCF) వంటి ఏజెన్సీల నుంచి పలు రకాల పప్పులను సేకరిస్తోంది. దీని తరువాత అది బఫర్ స్టాక్‌లో ఉంచబడుతుంది. ఈ బఫర్ స్టాక్‌లో పప్పులు అవసరమైనప్పుడు ప్రభుత్వం దానిని మార్కెట్లోకి విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications