చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ ఇప్పటికే తన కార్లను ఇండియాలో విక్రయిస్తోంది. అలాగే మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిసి ఎలక్ట్రిక్ బస్సుల తయారీలోనూ ఉంది.
ఈ క్రమంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీకి 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని చైనా BYD గత వారం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనికి BYD, ప్రసిద్ధ హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంయుక్తంగా పెట్టుబడి నాయకత్వం వహించాయి.

అయితే ఈ పెట్టుబడి దరఖాస్తును అంగీకరించలేమంటూ కేంద్ర ప్రభుత్వం తరస్కరించింది. హైదరాబాద్‌లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహం అండ్ అంతర్గత వాణిజ్య శాఖకు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనను కంపెనీలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధానంగా భద్రతా భయాలే కారణంగా ఉన్నట్లు కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు.
నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి మెగా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.10,000 నుంచి రూ.15,000 కోట్లను పెట్టుబడి పెట్టబోతోంది. దీనికి చైనాకు చెందిన BYD అన్ని రకాల సాంకేతిక సహాయం, సాంకేతిక మౌలిక సదుపాయాలను అందించాలని నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఈ మెగా పెట్టుబడి వెనక్కి వెళ్లింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications