For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Apple: ఇండియాలోనే ఆపిల్ మ్యాక్ బుక్స్ తయారీ..! కేంద్రం పెద్ద ప్లాన్ ఏమిటంటే..?

|

Apple: ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ తయారీ చైనా నుంచి ఇండియాకు మారిన విషయం మనందరికీ తెలిసిందే. తమిళనాడు కేంద్రంగా ఉత్పత్తికి కసరత్తు జరుగుతున్న వేళ త్వరలోనే మరిన్ని ఆపిల్ ఉత్పత్తులు ఇండియాలో తయారయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీని కోసం ప్రత్యేక ప్రణాళికను తెస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ప్రోత్సాహకాలు..

మరిన్ని ప్రోత్సాహకాలు..

IT హార్డ్‌వేర్ కోసం ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకం పరిధిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. గతంలో ఉన్న ప్రోత్సహకాలను రూ.7,380 కోట్ల నుంచి దాదాపు రూ.20,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆపిల్ తన MacBooks, iPad తయారీని భారత్ కేంద్రంగా నిర్వహించవచ్చని తెలుస్తోంది. 'చైనా-ప్లస్-వన్ స్ట్రాటజీ'ని దృష్టిలో ఉంచుకుని భారత్ లో ఆపిల్ తన తయారీ పర్యావరణ వ్యవస్థను పెంచాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

దేశంలో తయారీ..

దేశంలో తయారీ..

ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ కంపెనీలు ప్రస్తుతం దేశంలో బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆపిల్ కు చెందిన మాక్‌బుక్, ఐప్యాడ్ వంటి ఇతర ఉత్పత్తులను రెండవ దశలో దేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం పీఎల్ఐ పథకాన్ని మెరుగుపరచాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రతిపాదనను పంపింది. 2021లో స్మార్ట్‌ఫోన్‌ల కోసం PLI పథకాన్ని నాలుగేళ్ల కాలానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆటంకాలు..

ఆటంకాలు..

చైనా ఇండియాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో పూర్తిగా ఆపిల్ ఉత్పత్తుల తయారీని ఇండియాకు మార్చటానికి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే తయారీకి అవసరమైన విడిభాగాల కోసం కంపెనీ ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉండటమే కారణం. దీనికి తోడు ఆపిల్ ఉత్పత్తుల విక్రయానికి చైనా పెద్ద మార్కెట్లలో ఒకటి కావటంతో టెక్ దిగ్గజానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పైగా భారత్‌లో చైనా పెట్టుబడులను అనుమతించడం కోసం తనిఖీలను సులభతరం చేయాలని టెక్ కంపెనీలు నిరంతరం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి.

మ్యానుఫ్యాక్చరింగ్ హబ్..

మ్యానుఫ్యాక్చరింగ్ హబ్..

ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతున్న తరుణంలో.. 'గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్'గా మారాలని ప్రయత్నిస్తోంది. దీనిని సాకారం చేసుకోవటానికి Apple, HP, Dell వంటి ఇతర టాప్ సెల్లర్లను ఆకర్షించటం చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే.. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు సేవలందిస్తున్న పెద్ద కంపెనీలు కాబట్టి.

Read more about: apple macbook ipad business news
English summary

Apple: ఇండియాలోనే ఆపిల్ మ్యాక్ బుక్స్ తయారీ..! కేంద్రం పెద్ద ప్లాన్ ఏమిటంటే..? | Union government planning to expand PLI scheme benefits to attract apple manufacturing

Union government planning to expand PLI scheme benefits to attract apple manufacturing
Story first published: Monday, January 2, 2023, 14:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X