IPO News: కొత్త ఏడాది మార్కెట్లోకి వస్తున్న ఐపీవోల సంఖ్య గతంతో పోల్చితే చాలా తక్కువగా ఉంది. దాదాపు సగం ఏడాది గడిచిపోయినా గ్లోబల్ మార్కెట్లలో ఏర్పడిన గందరగోళాలు కుదుటపడకపోవటం కూడా దీనికి ఒక కారణంగా ఉంది. అయితే ప్రభుత్వ రంగ కంపెనీ మాత్రం తన ఐపీవోకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వివరాల ప్రకారం భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో)లో మిగిలిన 49 శాతం వాటాను IPO ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇదే క్రమంలో ఆర్బిట్రేషన్ కేసును ఉపసంహరించుకునేందుకు కంపెనీ ప్రమోటర్లు వేదాంతతో చర్చలు జరుపుతున్నారు. వీటికి సంబంధించిన వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే వెల్లడించటంతో వార్త వెలుగులోకి వచ్చింది.

స్టాక్ మార్కెట్‌లో కంపెనీ లిస్టింగ్‌కు భరోసా ఉండేలా ఆర్బిట్రేషన్ కేసును ఉపసంహరించుకోవాలని వేదాంతను కోరుతున్నట్లు సదరు అధికారి చెప్పారు. గనుల మంత్రిత్వ శాఖ, DIPAM బాల్కో పూర్వపు ప్రమోటర్ అయిన వేదాంత లిమిటెడ్‌తో "ప్రాథమిక చర్చలు" జరిపినట్లు వెల్లడించారు. కంపెనీలో మైనారిటీ వాటా కలిగి ఉన్న ప్రభుత్వం తన వాటాలను ఐపీవో రూపంలో అమ్ముకోవటానికి ముందుగా కేసును పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వేదాంత అంగీకారం కోసం చర్చలు కొనసాగుతున్నాయి.
తాము ప్రమోటర్లతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నామని పాండే వెల్లడించారు. వారితో వివరంగా చర్చిస్తామన్నారు. వేదాంత కంపెనీని మార్కెట్లో లిస్టే చేయాలంటే ముందుగా కేసును పరిష్కరించుకోవటం ద్వారా షేర్లకు మంచి విలువ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications