Pension News: ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఫార్ములాపై గందరగోళం నెలకొంది. కొత్త పెన్షన్ విధానాన్ని మోదీ సర్కార్ ప్రవేశపెట్టడంతో రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పాత పద్ధతికి మారిన సంగతి తెలిసిందే.
అయితే కేంద్రం నూతన పెన్షన్ ఫార్ములాను తీసుకురావటం ద్వారా బయటకు వెళ్లిన రాష్ట్రాలకు నమ్మకాన్ని కలిగించాలని చూస్తోంది. ఉద్యోగులు చివరిగా అందుకున్న జీతంలో కనీసం 40-45 శాతాన్ని పెన్షన్ రూపంలో పొందేలా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించినట్లు తెలుస్తోంది. 2024లో మోదీ మరోసారి ప్రధానిగా అవ్వాలనుకుంటున్న వేళ పెన్షన్ వ్యవస్థను సమీక్షించడానికి ప్రభుత్వం ఏప్రిల్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఈ చర్య వచ్చింది.

2004లో ఆర్థిక సంస్కరణ తర్వాత ప్రస్తుతం అమలులో ఉన్న విధానం వచ్చింది. అయితే అనేక రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యతిరేకత రీత్యా దీనిని మళ్లీ పరిశీలించవలసి వచ్చింది. అయితే పాత పెన్షన్ విధానం ఒక ఉద్యోగి చివరిగా డ్రా చేసిన జీతంలో 50% స్థిర పెన్షన్‌కు హామీ ఇస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న సమయంలో దీనికోసం ఎలాంటి సొమ్ము సహాయంగా అందిచాల్సిన అవసరం కూడా లేదు. అయితే ప్రస్తుతం ఉన్న కొత్త స్కీమ్ కింద బేసిక్ శాలరీలో ఉద్యోగి 10 శాతం, ప్రభుత్వం 14 శాతం కాంట్రిబ్యూచ్ చేస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ఉన్న విధానానికి మార్పులు చేయాలనుకుంటున్నప్పటికీ.. పాత పద్ధతిలోకి మారే ప్రసక్తే లేదని సదరు అధికారులు రాయిటర్స్ కు వెల్లడించారు. భారతదేశ బడ్జెట్‌లో పెన్షన్‌లు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టే వాటిలో ఒకటిగా ఉన్నప్పటికీ.. తాజా ప్రయత్నం పాత పెన్షన్ వ్యవస్థకు తిరిగి వెళ్లిన రాష్ట్రాల ఆందోళనలను నివృత్తి చేస్తుందని వారు ఆశిస్తున్నారు. ప్రస్తుత రాబడులు ఉద్యోగులు తమ చివరి జీతంలో దాదాపు 38% పెన్షన్‌గా పొందుతున్నట్లు చూపుతున్నాయి.


Click it and Unblock the Notifications