పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన ప్రభుత్వం.. PPF వడ్డీ రేట్ల తాజా వివరాలు..
PPF Interest Rates: దేశంలోని పొదుపు పథకాల రేట్లను కేంద్ర ప్రభుత్వం సమయానుగుణంగా మారుస్తుంటుంది. ఈ క్రమంలో పీపీఎఫ్ స్కీమ్ కింద డబ్బును పొదుపు చేసుకునేవారికి సంబంధించి పెద్ద వార్త విడుదలైంది. ఇదే క్రమంలో 2023-23 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి అన్ని చిన్న పొదుపు పథకాలకు సంబంధించిన వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పీపీఎఫ్ ఖాతాదారులు దాచుకునే సొమ్ముపై 7.1 శాతం వడ్డీ రేటు లభించనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ విషయంలో ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. అంటే వారు గతంలో పొందుతున్న వడ్డీ రేటునే తిరిగి కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. వరుసగా 12వ త్రైమాసికంలో కూడా పీపీఎఫ్ ఖాతాదారులకు చెల్లించే వడ్డీ రేట్లను మార్చలేదు. బయట ద్రవ్యోల్బణం కారణంగా ఆర్బీఐ రెపో రేటును పెంచుతున్న తరుణంలో బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందిస్తున్న దానికంటే తక్కువ వడ్డీని పీపీఎఫ్ ఖాతాదారులకు చెల్లించటంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు.

ఎవరైనా ఇన్వెస్టర్ పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి కనీసం రూ.500 నుంచి తన పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అలాగే పీపీఎఫ్ కింద గరిష్ఠంగా సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు ఖాతాదారులు డిపాజిట్ చేయవచ్చు. సాధారణంగా ఈ స్కీమ్ కింద 15 ఏళ్ల వరకు పొదుపుచేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆ తర్వాత దీనిని కొనసాగించేందుకు వెసులుబాటు ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద పొదుపు చేసిన మెుత్తంలో 25 శాతం వరకు డబ్బును రుణంగా పొందేందుకు అవకాశం కూడా ఉంటుంది.
ఇతర పెట్టుబడి సాధనాలపై వడ్డీ..?
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచారు.
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగింది.
- సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును 7.6 శాతం నుంచి 8 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం.
- ఇక కిసాన్ వికాస్ పత్రాల్లో డబ్బు పొదుపు చేసేవారికి 120 నెలల కాలానికి 7.2 నుంచి 115 నెలల కాలానికి 7.5 శాతానికి పెంచారు.


Click it and Unblock the Notifications