LPG Subsidy: సామాన్యులకు శుభవార్త.. ఉజ్వల యోజన కింద గ్యాస్ సబ్సిడీ పెంపు..

LPG Subsidy: దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి మెుదలైన వేళ కేంద్రం ప్రజలకు వరాల ప్రకటన దూకుడు పెంచింది. గత నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన మోదీ సర్కార్ తాజాగా మరోసారి సబ్సిడీని తగ్గిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

వివరాల్లోకి వెళితే.. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్లపై అందిస్తున్న సబ్సిడీని ప్రస్తుతం ఉన్న రూ.200లను రూ.300కి పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అక్టోబర్ 4, 2023న ప్రకటించారు. సెప్టెంబర్‌లో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని కేబినెట్ ఆమోదించిన కొన్ని వారాలు కూడా గడవక ముందరే కేంద్రంలోని బీజేపీ మరోసారి ధరల తగ్గింపు ప్రకటన వెలువడింది. ద్రవ్యోల్బణం అధికంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇది సామాన్య, దిగువ వర్గాల ప్రజలకు పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు.

Union Government Hikes LPG subsidy under Ujjwala scheme to 300 per cylinder, know details

మే 2016లో పెట్రోలియం & సహజవాయువు మంత్రిత్వ శాఖ(MOPNG) 'ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన' కింద గ్రామీణ, పేద కుటుంబాలకు వంట గ్యాస్ తక్కువ రేటుకు అందించే ఉద్ధేశ్యంతో ప్రారంభించబడింది. ఈ కేటగిరీ కింద ఉన్న చాలా మంది ప్రజలు గతంలో సాంప్రదాయ ఇంధన వనరులైన కట్టెలు, బొగ్గు, వంట చెరకు, పిడకలు వంటి వాటిని వినియోగించే వారు. అప్పట్లో మే 1, 2016న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఉజ్వల 2.0 కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి..??
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కోసం ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్థానిక LPG పంపిణీ ఏజెన్సీలో పూరించి, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. దీనికి అవసరమైన అర్హతలు ఏంటంటే..

- ఈ స్కీమ్ 18 ఏళ్లు నిండిన మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది

- ఒక ఇంటిలోని ఏ OMC నుండి ఏ ఇతర LPG కనెక్షన్ ఉండకూడదు.

- SC, ST, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), అత్యంత వెనుకబడిన తరగతులు (MBC), అంత్యోదయ అన్న యోజన (AAY), టీ అండ్ ఎక్స్-టీ గార్డెన్ తెగలు, అటవీ నివాసులు, నివసించే ప్రజలు ద్వీపాలు, నదీ ద్వీపాలు, SECC గృహాలు (AHL TIN) లేదా 14-పాయింట్ డిక్లరేషన్ ప్రకారం ఏదైనా పేద గృహాల క్రింద నమోదు చేయబడిన మహిళలు పథకం పొందేందుకు అర్హులు.

దీనికోసం దరఖాస్తుదారు కేవైసీ వివరాలు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ వివరాలు వంటివి అందించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+