Work From Home: దేశంలోని కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అతిపెద్ద సమస్యగా మారింది. కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి తీరాల్సిందేనని చెబుతున్నప్పటికీ చాలా మంది దానికి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. మరికొందరు హైబ్రిడ్ విధానంతో సరిపెట్టుకుంటున్నారు.

కేంద్రం ప్రకటన..
కంపెనీల నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ.. వారికి వర్క్ ఫ్రమ్ హోన్ విధానంలో పనిచేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గురువారం అనుమతినిస్తూ ప్రకటన చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న సెజ్ లలో ఉన్న ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులకు 100 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని అనుమతిస్తూ గడువును డిసెంబర్ 2023 వరకు పొడిగించింది. ఇది ఐటీ కంపెనీలకు కొన్ని షరతుల మేరకు అనుమతించబడింది.

అనుమతులు..
సెజ్ లోని ఏదైనా కంపెనీ తన ఉద్యోగులను ఇంటి నుంచి లేదా వారికి నచ్చిన ఇతర ప్రదేశం నుంచి పనిచేయటానికి అనుమతించవచ్చని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలిపింది. తాత్కాలిక ఉద్యోగులు, ఆఫ్‌సైట్ ఉద్యోగులు, ట్రావెలింగ్ ఉద్యోగులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని నోటిఫికేషన్లో వెల్లడించింది. కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు అస్టకష్టాలు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన కంపెనీలకు కొత్త సమస్యగా మారనుందని తెలుస్తోంది.

హైబ్రిడ్ విధానం..
ఐటీ సేవల రంగంలో ఉన్న కంపెనీలు చాలా వరకు ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో 2-3 రోజులు కార్యాలయానికి రప్పిస్తున్నాయి. అయితే నగరాల్లో విపరీతంగా ఉండే ట్రాఫిక్, రవాణా ఖర్చులు, సమయం వృధా కావటం వంటి కారణాలను టెక్కీలు ఎక్కువగా ఎత్తిచూపుతున్నారు. అందుకే చాలా టెక్ కంపెనీలు చిన్న కార్యాలయాలను ఉద్యోగులకు దగ్గరగా చిన్న కార్యాలయాలతో పాటు టైర్-2,3 నగరాల్లో ఏర్పాటు చేస్తున్నాయి.

పని సాఫీగా జరిగేందుకు..
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫీగా సాగేలా చూసేందుకు అవసరమైన ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లతో పాటు ఇతర సామాగ్రి గురించి తన నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలను అందించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications