Windfall Tax: అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడ్ పెట్రోల్, డీజిల్ తో పాటు విమాన ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) తగ్గించాలనే నిర్ణయం వెలువడటంతో చమురు కంపెనీలు సంతోషంలో ఉన్నాయి.

సమీక్ష తర్వాత..
ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎన్జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే ముడి పెట్రోలియంపై విండ్‌ఫాల్ టాక్స్ రూ.5,050/టన్ను నుంచి తాజాగా రూ.4,350కి తగ్గించబడింది. ప్రతి లీటరు డీజిల్ పై పన్ను రూ.7.5 నుంచి రూ.2.5కి తగ్గించారు. విమాన ఇంధనంపై పన్ను రూ.6 నుంచి రూ.1.5కి తగ్గించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం తెలుస్తోంది. పెట్రోలుపై విధించే లెవీ శూన్యంగానే కొనసాగుతోంది.

నిర్మలా సీతారామన్..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరిన తర్వాత ఈ విధానాన్ని అమలులోకి తెస్తామని చెప్పారు. ఫిబ్రవరి 15న పరిశ్రమ ఛాంబర్ PHDCCI సభ్యులతో బడ్జెట్ అనంతర ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధిక ఇంధన ధరలు ఉన్న దేశాల జాబితాలో ఇండియా ఉండటం తెలిసిందే.

విండ్‌ఫాల్ టాక్స్ అంటే..?
విండ్‌ఫాల్ టాక్స్ లేదా SAED అనేది కంపెనీ లేదా పరిశ్రమపై ప్రభుత్వం విధించే ఒక ప్రత్యేక పన్ను. కంటే కంపెనీ బాధ్యత వహించనిదాని నుంచి పొందే ఆర్థిక లాభాలను విండ్‌ఫాల్ లాభాలని అంటారు. ఇవి అనేక అంతర్జాతీయ పరిణామాలు, కరెన్సీ పనితీరు వంటి వాటి ద్వారా వస్తుంటాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.25,000 కోట్లను వసూలు చేసింది. ఈ టాక్స్ రేట్లను కేంద్రం ప్రతి 15 రోజులకు ఒకసారి సవరిస్తుంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications