Windfall Tax: కేంద్ర ప్రభుత్వం తాజాగా విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలోని క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలకు పెద్ద ఊరట లభించింది.
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, డీజిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా క్రూడాయిల్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పన్ను టన్నుకు రూ.9,800 నుంచి రూ6,300కి తగ్గించబడింది. అలాగే డీజిల్ ఎగుమతులపై SAEDని లీటరుకు రూ.2 నుంచి లీటరుకు రూ.1కి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ATF), పెట్రోల్ ఎగుమతి సుంకంలో ఎటువంటి మార్పులు ఉండవు. తాజా నిర్ణయంలో వివరించిన విధంగా ఇవి సున్నా వద్ద ఉంచాయి. కొత్త పన్ను రేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది. గత సర్దుబాటు నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో, తగ్గింపు అవసరం ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అక్టోబర్‌లో బ్యారెల్ చమురు ధర 90.08 డాలర్ల ఉండగా.. సెప్టెంబరులో 93.54 డాలర్ల వద్ద ఉంది. ప్రస్తుత నెలలో భారతదేశం దిగుమతి చేసుకున్న బాస్కెట్ ముడి చమురు నెలవారీ సగటు బ్యారెల్‌కు 84.78 డాలర్లుగా ఉంది. భారత ప్రభుత్వం జూలై 1న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లను అమలు చేయటం ప్రారంభించింది. ఇంధన కంపెనీల సూపర్‌నార్మల్ లాభాలపై పన్ను విధించే ప్రపంచ ధోరణికి అనుగుణంగా మనదేశంలో దీనిని ప్రారంభించటం జరిగింది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పన్ను రేట్లు సమీక్షించబడతాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications