Railway Stocks: మరికొన్ని గంటల వ్యవధిలో ప్రారంభం అవుతున్న బడ్జెట్ సమావేశాలపై ప్రజలతో పాటు ఇన్వెస్టర్లు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రైల్వేలకు భారీ కేటాయింపులపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ప్రధానంగా ప్రస్తుతం మోదీ సర్కార్ దేశంలోని అన్ని రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో సెమీ హైస్పీడ్‌తో రైళ్లను నడపడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు రూ.3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించొచ్చని తెలుస్తోంది. ఈ డబ్బుతో స్లీపర్ వందేభారత్ రైలు కోచ్‌ల తయారీ, రైల్వేలో యాంటీ కొలిజన్ టెక్నాలజీ-ఆర్మర్ ఏర్పాటు, అమృత్ భారత్ రైలు కోచ్ ఇంజిన్ నిర్మాణం, కొత్త లైన్ నిర్మాణం, డబ్లింగ్, గేజ్ మార్పిడి తదితర అభివృద్ధి పనులకు వినియోగించనుంది.

మార్చి నాటికి స్లీపర్ వందేభారత్ రైలును నడపడానికి చెన్నైలోని ఐసీఎఫ్‌లో కోచ్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని రైల్వే బోర్డు అధికారులు వెల్లడించారు. రైల్వే ప్రీమియం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో స్లీపర్ వందే భారత్ రైళ్లను నడపనున్నారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైళ్లను ఇప్పటికే నడుస్తున్నాయి. అలాగే పుల్-పుష్ టెక్నాలజీతో అమృత్ భారత్ రైళ్ల సంఖ్యను పెంచడానికి రైల్వే కోచ్‌లు, కొత్త ఇంజిన్‌లను ఉత్పత్తి చేస్తుంది.
గత సాధారణ బడ్జెట్‌లో మొత్తం మూలధన వ్యయం రూ.2.60 లక్షల కోట్లుగా ఉంది. డిసెంబర్ 2023 వరకు మూలధన వ్యయం నుంచి రూ.1,95,929.97 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారి తెలిపారు. రూ.3.20 లక్షల కోట్ల బడ్జెట్‌తో ఢిల్లీ-ముంబై, దిల్లీ-కోల్‌కతా సహా ఇతర రద్దీగా ఉండే రైల్వేల్లో యాంటీ-కొలిజన్ టెక్నాలజీ కవచాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇది కాకుండా పైన పేర్కొన్న రెండు రైల్వేలలో వందేభారత్ రైళ్లను సెమీ హైస్పీడ్ (గంటకు 160-200 కిలోమీటర్లు) నడపడానికి మెరుగుదలలు చేయబడతాయి.
లాభపడే రైల్వే స్టాక్స్ :కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైల్వేలను వేగంగా అభివృద్ధి చేస్తున్నందున ఈరంగంలోని అనేక స్టాక్స్ లాభాపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే రంగంలో పనిచేస్తున్న వివిధ షేర్లను పరిశీలిస్తే.. టిటాగర్ వ్యాగన్స్, ఐఆర్సీటీసీ, రైల్ వికాస్ నిగమ్, కంటైనర్ కార్పొరేషన్, రీట్స్, టెక్స్‌మాకో రైల్ ఇంజన్స్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్, ఐఆర్కాన్ ఇంటర్నేషనల్, రెయిల్ టెల్, భారత్ ఎర్త్ మూవర్స్, బీఈఎమ్ఎల్ సహా మరిన్ని కంపెనీలు ఈ రంగంలో వ్యాపారాలను కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications