Rice Exports: పారాబాయిల్డ్ రకం బియ్యంపై ఎగుమతి సుంకం.. ప్రపంచం విలవిల..
Rice Exports: దేశంలో మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్ర ధరల కట్టడికి వేగంగా చర్యలు చేపడుతోంది. ఉల్లి నుంచి చక్కెర వరకు అన్నింటినీ అందుబాటు ధరల్లో ఉంచేందుతు ఎగుమతులపై భారీగా సుంకాలు వేస్తోంది.
దేశంలో ఏర్పడిన వర్షాబావ పరిస్థితులు పంటల ఉత్పత్తిపై తీవ్రంగా ప్రతికూలతలను చూపించింది. దీంతో గతంలో నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులను పూర్తిగా నిషేధించిన భారత్ తాజాగా.. పారాబాయిల్డ్ రకం బియ్యంపై తక్షణం అమల్లోకి వచ్చేలా 20 శాతం సుంకాన్ని విధించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఎగుమతిదారు భారత్ సరుకుల లభ్యతను మరింత తగ్గించగలదు. ఈ నిర్ణయం ఇప్పటికే 12 ఏళ్ల గరిష్ఠాల వద్ద ట్రేడ్ అవుతున్న ప్రపంచ బియ్యం ధరలను మరింత పెరగటానికి కారణం అవుతోంది.

ఏడాది నూకలు(విరిగిన బియ్యం) బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన తరువాత.. గత నెలలో ప్రజలు విస్తృతంగా వినియోగించబడే బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించి భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచింది. దీంతో అనేక మంది తెల్ల బియ్యానికి బదులుగా పారాబాయిల్డ్ రైస్ కొనుగోళ్లను పెంచారు. ఈ కారణంగా వాటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని గ్లోబల్ ట్రేడ్ హౌస్‌తో ముంబైకి చెందిన ఒక డీలర్ తెలిపారు.
"ఈ సుంకంతో థాయ్‌లాండ్, పాకిస్థాన్‌ల నుంచి వచ్చే సామాగ్రితో పోలిస్తే, భారతీయ పారాబాయిల్డ్ బియ్యం ఖరీదైనదిగా మారిపోయింది. కొనుగోలుదారులకు ఇప్పుడు ఎటువంటి ఎంపిక లేకుండా పోయింది" అని ముంబైకి చెందిన డీలర్ చెప్పారు.
భారతదేశం 2022లో 7.4 మిలియన్ టన్నుల బాయిల్డ్ బియ్యాన్ని ఎగుమతి చేసింది. జూలైలో ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ బియ్యం ధర సూచిక దాదాపు 12 ఏళ్ల అత్యధిక స్థాయికి పెరిగింది. ఎందుకంటే ఎగుమతులపై భారతదేశం ఆంక్షలు విధించిన తర్వాత కీలక ఎగుమతి దేశాల్లో ధరలు బలమైన డిమాండ్ డారణంగా అమాంతం పెరిగిపోయాయి. ఇలా భారత్ దేశీయ అవసరాల కోసం అనేక రకాల ఉత్పత్తులపై సుంకాలను ఇటీవలి కాలంలో పెంచుతోంది.


Click it and Unblock the Notifications