Onion Prices: దేశంలో ఉల్లి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో పెరిగిపోతున్న రేట్లకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఎగుమతి సుంఖాన్ని భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై చాలా రాష్ట్రాల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. కొన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ క్రమంలో రైతుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాఫెడ్ ద్వారా క్వింటా ఉల్లిని రూ.2,410 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతిపక్షాలు దీనిని తప్పుడు కోళంలో చూపి రైతులను పక్కదారి పట్టించేందుకు చూస్తున్నాయని ఆయన అన్నారు. కేంద్రం 40 శాతం ఎగుమతి సుంకాన్ని వ్యతిరేకిస్తూ.. ఆసియాలోని అతిపెద్ద ఉల్లి మార్కెట్ నాశిక్ ట్రేడర్లు కొనుగోలు నిలిపివేశారు. దీంతో అక్కడ కిలో ధర రూ.45-50కి చేరుకుంది.

ఈ క్రమంలో సోమవారం NCCF అవుట్‌లెట్‌లు దేశ రాజధాని దిల్లీలో కిలోకు రూ.25 సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను రిటైల్ అమ్మకాలను ప్రారంభించాయి . ఎన్‌సిసిఎఫ్ ఇప్పటికే సామాన్యులను వణికిస్తున్న టమోటాలను సైతం సబ్సిడీ ధరలకు విక్రయిస్తోంది. మార్కెట్ జోక్యం కోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, అస్సాంలను కూడా గుర్తించింది. బఫర్ స్టాక్‌లను విడుదల చేయడం ద్వారా ఈ రాష్ట్రాల్లో ఉల్లి లభ్యతను పెంచుతోంది. గత నెల చివరిలోనే ఇలాంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరికలు వచ్చాయి.
ప్రస్తుతం శ్రావణమాసం ప్రారంభమైంది. ఈ సమయంలో ఉత్తర భారతదేశంలో ప్రజలు ఉల్లి వినియోగం భారీగా తగ్గిస్తారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు ఈ మాసంలో ఉల్లిపాయ తినరని తెలుస్తోంది. ఇది సరఫరా డిమాండ్ మధ్య అంతరాన్ని తగ్గించటంలో కొంత మేర దోహదపడుతుందని తెలుస్తోంది. ఇది కొంత వరకు ధరల పెరుగుదలను అదుపుచేసేందుకు ఉపయోగపడనుంది. దీనికి ముందు పప్పులు, బియ్యం, కూరగాయలు, పండ్లు, టమాటా, వంటనూనెలు.. ఇలా అనేక వంటింటి సామాను ధరలు భారీగా పెరిగి సామాన్యుల జోబులకు చిల్లు పెట్టాయి.


Click it and Unblock the Notifications