EPFO News: పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు నిర్ణయం.. గ్రీన్ సిగ్నల్..
EPFO Interest: ఈపీఎఫ్ఓ చందాదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ FY23 కోసం చెల్లించనున్న వడ్డీ రేటుకు అంగీకారం తెలిపింది.
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం EPFO పొదుపు నిధులపై అనేక దశాబ్ధాల అత్యల్ప వడ్డీ రేటు అయిన 8.1 శాతాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి రేటును కొద్దిగా పెంచుతూ 8.15 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. బయట ద్రవ్యోల్బణం కారణంగా బ్యాంకులు ఎక్కువ వడ్డీ అందిస్తున్న తరుణంలో కేంద్రం ప్రకటించిన రేటు తక్కువగా ఉన్నట్లు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల భవిష్య నిధి పథకం 1952లోని 60(1) కింద 2022-23 సంవత్సరానికి వడ్డీని EPF స్కీమ్‌లోని ప్రతి సభ్యుని ఖాతాకు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదించినట్లు ఉద్యోగుల ప్రోవిజన్(EPFO) సర్క్యులర్ తెలిపింది. దీనికి ముందు కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు మార్చి 28న FY23కి 8.15% వడ్డీ రేటును సిఫార్సు చేశారు. ఈ నిర్ణయం పీఎఫ్ విరాళాలపై 8.15% వడ్డీ రేటును చందాదారులకు క్రెడిట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
FY23కి EPFO రూ.90,497.57 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. 70.2 మిలియన్ల సభ్యులతో దేశంలో అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం రూ.2.50 లక్షల కంటే ఎక్కువ పీఎఫ్ నిధికి విరాళంగా జమచేస్తే సదరు ఆదాయంపై పన్ను విధించబడుతోంది. 2021-22లో కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చింది.


Click it and Unblock the Notifications