For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

No GST: జీఎస్టీపై ఆందోళన వద్దు.. ఈ 14 వస్తువులకు వర్తించదు.. నిర్మలా సీతారామన్ మెలికతో..

|

GST Relief: సోమవారం నుంచి అనేక వస్తువులను జీఎస్టీ జాబితాలోకి తీసుకురావటంపై దేశ వ్యాప్తంగా ప్రజలు, వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 14 వస్తువులపై జీఎస్టీ వర్తించదని వెల్లడించారు. అయితే ఇందులో ఒక మెలికను పెట్టారు ఆవిడ. ఈ జాబితాలోని వస్తువులను లూజ్ గా, ప్యాకేజింగ్ అండ్ లేబిలింగ్ లేకుండా ఉండాలని స్పష్టం చేశారు.

కొన్ని కొత్త వస్తువులపై జీఎస్టీ విధింపు, ధరల పెంపు అంశంపై 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగడంతో లోక్ సభ నిన్న వాయిదా పడింది. దీని ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ట్విట్టర్‌లో 14 ఉత్పత్తులపై పన్ను విధింపుల గురించి వివరించారు.

5% GST..

తృణధాన్యాలు, బియ్యం, గోధుమ పిండి, పెరుగు వంటి ఆహార పదార్థాలపై 5% జీఎస్టీ ముందుగా ప్యాక్ చేసి లేబుల్ చేయబడిన వస్తువులకు మాత్రమే పరిమితమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గత నెలలో జీఎస్టీ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని, ఇందులో బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన సభ్యులు కూడా అంగీకరించినట్లు ఆమె తెలిపారు.

14 వస్తువుల వివరాలు..

14 వస్తువుల వివరాలు..

అదేవిధంగా.. పప్పులు, గోధుమలు, వోట్స్, మొక్కజొన్న, బియ్యం, గోధుమ పిండి, మైదా, సూజీ/రవ్వ, శనగపిండి, ఫ్రైలు, పెరుగు/లస్సీలతో సహా 14 వస్తువులను లూజ్ గా విక్రయిస్తే జీఎస్టీ పరిధిలోకి రావని తన ట్వీట్ లో తెలిపారు. ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించటం కొత్తేమీ కాదని.. కానీ వీటిపై తొలిసారిగా పన్ను విధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

రెండు తెలుగు రాష్ట్రాల్లో రిటైల్‌గా ఎలాంటి లేబిలింగ్, ముందస్తు ప్యాకింగ్ లేకుండా లూస్‌లో కొనుగోలు చేసిన ఈ 14 ఉత్పత్తులకు 5% GST నుంచి మినహాయింపు ఉంది. కాబట్టి ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిల్లరగా కొనుగోలు దారులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు.

GST కౌన్సిల్..

GST కౌన్సిల్..

ఈ 5 శాతం పన్ను లెవీ GST కౌన్సిల్ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. జూన్ 28, 2022న చండీగఢ్‌లో జరిగిన 47వ సమావేశంలో పన్ను రేటు మార్పు అంశాన్ని మంత్రి మండలి సమర్పించినప్పుడు అన్ని రాష్ట్రాలు GST కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యాయి. ఆ సమయంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపాయి.

అసలు ఎందుకు ఈ నిర్ణయం..

అసలు ఎందుకు ఈ నిర్ణయం..

పన్ను లీకేజీని నిరోధించేందుకు ఈ పన్ను పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్ లో వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకురావటానికి ముందు అధికారులు, మంత్రుల కమిటీతో వివిధ స్థాయిల్లో దీనిపై చర్చించినట్లు సీతారామన్ తెలిపారు.

Read more about: gst జీఎస్టీ
English summary

No GST: జీఎస్టీపై ఆందోళన వద్దు.. ఈ 14 వస్తువులకు వర్తించదు.. నిర్మలా సీతారామన్ మెలికతో.. | union finance minister nirmala sithraman says no gst on 14 items if sold in loose with out branded packing

union finance minister nirmala sithraman says no gst on 14 items
Story first published: Wednesday, July 20, 2022, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X