Paytm crisis: పేటీఎం ఆంక్షలపై నిర్మలా సీతారామన్ కీలక కామెంట్స్..!!
Nirmala Sitharaman: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరినోటా వినిపిస్తున్న మాట పేటీఎం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారం నిలిపివేయాలంటూ ఆంక్షలు వేయటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ వార్త దేశీయ స్టాక్ మార్కెట్లలో పెను సంచలనానికి కారణమైంది. ప్రకటన వచ్చిన మెుదటి రోజున పేటీఎం షేర్లు 20 శాతం క్షీణించగా.. రెండవ రోజు శుక్రవారం మార్కెట్లు మరో 20 శాతం కుప్పకూలటంతో మెుత్తంగా 40 శాతం క్షీణతతో పేటీఎం స్టాక్ రూ.487.20 వద్ద ప్రయాణాన్ని ముగించింది. ఈ సంక్షోభంపై స్టార్టప్ వ్యవస్థాపకుల నుంచి తీవ్రమైన ప్రతిస్పందనలు సైతం నమోదు కావటం పెద్ద చర్చకు దారితీసింది.

ప్రస్తుతం పేటీఎంలో కొనసాగుతున్న సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ క్రమంలో ఆమె ఇంటర్వ్యూలో ఫిన్‌టెక్ రంగంపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. అయితే నేరుగా పేటీఎం కంపెనీలోని పరిస్థితులపై వ్యాఖ్యానించేందుకు మాత్రం నిరాకరించారు. ఫిన్‌టెక్ రంగానికి భారతదేశం చాలా సహకారం అందించిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
ఈ వారం ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని ఫిన్‌టెక్ పర్యావరణ వ్యవస్థ పోస్టర్ చైల్డ్ అయిన పేటీఎంని జనవరి 31న దెబ్బతీసింది. "ఆకస్మిక" నిర్ణయం ఈ రంగంలోని చాలా మంది వాటాదారులను ముఖ్యంగా ఫిన్‌టెక్ స్టార్టప్‌లను, ఈ రంగానికి సంబంధించి రెగ్యులేటర్ వైఖరిని ప్రశ్నించేలా చేసింది.
దేశంలో న్యూ ఏజ్ సంస్థలను నిర్మించడాన్ని కొనసాగించడానికి తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఆర్థిక సాంకేతిక పరిష్కారాల కోసం చాలా మంది ఇండియా వైపు చూస్తున్నాయని నిర్మలమ్మ పేర్కొన్నారు. అలాగే ఈ రంగంలో భారత సహకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిందన్నారు.


Click it and Unblock the Notifications