Finance Minister: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు వచ్చే నెలలో ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సహా సెబీ ఛైర్ పర్సన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో బేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
వడ్డీ రేట్ల గురించి చర్చించేందుకు వచ్చే నెలలో సెంట్రల్ బ్యాంక్ కమిటీ సమావేశం కానుంది. దీనికి ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్.. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌ను కలిశారు. సెబీ ఛైర్‌పర్సన్ మధబి పూరీ బుచ్‌తో కూడా విడిగా సమావేశమైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం Xలో పోస్ట్ చేసింది.

ఫిబ్రవరి 2023 నుంచి RBI బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం ఎలివేటెడ్ స్థాయిలోనే ఉంచింది. కాగా ఆయా రంగాలు ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపు కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్ 3-5 మధ్య సమావేశం కానుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం సహా వృద్ధి టార్గెట్‌ను ఇందులో వివరించనున్నట్లు భావిస్తున్నారు.
మరోపక్క గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు అధిక అస్థిరతకు గురవుతున్నాయి. మార్చి 7న BSE బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 74,245 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. ఇవాళ చూస్తే 72,101 దగ్గర ముగిసింది. ఈ సమయంలో రెండు సంస్థల అధినేతలతో ఆర్థిక మంత్రి మీటింగ్ ప్రత్యేకంగా నిలిచింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications