Byjus: విదేశీ డైరెక్టర్లు ముగ్గురు బైజూస్ కంపెనీ బోర్డు నుంచి రాజీనామాలు చేయటం పెద్ద ప్రమాదాన్ని సూచిస్తోంది. అయితే ఈ రాజీనామాల తర్వాత ప్రభుత్వం రంగంలోకి దిగటంతో అందరి చూపు ఎడ్‌టెక్ స్టార్టప్‌పై పడింది.
బైజూస్‌లో ఇప్పుడు CEO వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్, అతని భార్య దివ్య గోకుల్‌నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్ మాత్రమే డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. అయితే రాజీనామా చేసిన బోర్డు సభ్యులను వాటిని వెనక్కి తీసుకునేలా చేసేందుకు కంపెనీ చర్చలు కూడా జరుపుతోందని వెళ్లడైంది. అలాగే ఆడిటింగ్ సంస్థ సైతం రాజీనామా చేయటంతో పరిస్థితులు చేజారుతున్నట్లు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బైజూస్ నిర్వహణలో అనేక పెద్ద రాజీనామాలు రావటంతో.. తాజాగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీ కార్పొరేట్ పాలనలో లోపాల గురించి తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు CNBC-TV18 నివేదించింది. అయితే అలాంటిదేమీ లేదని, అటువంటి విచారణ గురించి తెలియదని కంపెనీ నిరాకరించింది. అలాగే ప్రభుత్వం వైపు నుంచి దర్యాప్తు గురించి అధికారికంగా ఎలాంటి విషయాలు ప్రస్తుతానికి బయటకు రాలేదు. అయితే కంపెనీ మాత్రం రాజీనామలు చేసిన వారిని పునఃపరిశీలించమని ఒప్పించే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది.
బైజూస్ కంపెనీ అకౌంట్లను, ఆర్థిక వ్యవహారాలను ఆడిట్ చేసేందుకు 2025 వరకు ఎంచుకున్న డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్.. ఆర్థిక నివేదికల్లో జాప్యం కారణంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బైజూస్ ప్రమోటర్ కంపెనీ అయిన థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డుకు రాసిన లేఖలో డెలాయిట్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌ల స్వీకరణలో జాప్యం కారణంగా ఆడిట్‌ను చేపట్టలేకపోయామని, దీని ఫలితంగా సకాలంలో ఆడిటింగ్ పూర్తి చేయడంలో విఫలమైనట్లు పేర్కొంది. ఇదే క్రమంలో బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల రుణ చెల్లింపు కోసం US కోర్టులో రుణదాతలపై చట్టపరమైన కేసును దాఖలు చేసింది. కంపెనీకి అప్పు ఇచ్చిన రుణదాతలు వేధిస్తున్నారని ఆరోపించారు.


Click it and Unblock the Notifications