LPG Gas Price: గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింపు..!!
LPG Gas Price: సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులకు సంబంధించిన ప్రకటనలు ప్రతి నెల మెుదటి తారీఖున వస్తుంటాయి. అయితే తాజాగా కేంద్ర క్యాబినెట్ సిలిండరుపై రూ.200 తగ్గించాలనే నిర్ణయం చర్చిస్తున్నట్లు వెల్లడైంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో రానున్న కొన్ని నెలల్లోనే ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. ఈ క్రమంలో ఓటర్లను టార్గెట్ చేసుకుని బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయటం.. డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచటంతో సామాన్యులు ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిని కొంత తగ్గించే యోచనలో ఉజ్వల్ స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్లు పొందుతున్న కుటుంబాలకు ఊరటను అందించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది.

వివిధ వార్తా మాధ్యమాల్లో వచ్చిన నివేదికల ప్రకారం ఉజ్వల స్కీమ్ కింద సిలిండరు ధరను రూ.200 మేర తగ్గించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈరోజు మధ్యాహ్నం 3.30కి జరిగే క్యాబినెట్ బ్రీఫింగ్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ నిర్ణయాన్ని ధృవీకరించే అవకాశం ఉంది. వంట గ్యాస్‌కు అందించిన సబ్సిడీపై అండర్ రికవరీని ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు నివేదించినట్లు CNBC ఆవాజ్ వెల్లడించింది. గ్యాస్ ధరల తగ్గింపు కోసం ప్రభుత్వానికి మొత్తం ఖర్చు సుమారు రూ.7,500 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం.
ఇటీవల గరిష్ఠ స్థాయిల నుంచి ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎల్‌పీజీ ధరలు కొంతకాలంగా తగ్గడం లేదు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చమురు మార్కెటింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దిల్లీలో వంట గ్యాస్ 14.2 కిలోల సిలిండర్‌కు రూ.1,103గా ఉంది. దేశీయ LPG రేటు చివరిగా మార్చి 1న మార్చబడింది. అప్పట్లో సిలిండరుకు రూ.50 మేర కంపెనీలు రేటును పెంచాయి.


Click it and Unblock the Notifications