BSNL News: భారత టెలికాం రంగంలో ప్రస్తుతం అతిపెద్ద పోటీ కొనసాగుతోంది. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు కంపెనీల సంఖ్య భారీగా తగ్గింది. ప్రధానంగా పోటీ రెండు మూడు కంపెనీల మధ్యనే కొనసాగుతోంది.
ఈ క్రమంలో ప్రైవేటు టెలికాం ఆపరేట్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ వేగంగా దూసుకొస్తోంది. ఇప్పటికే 4జీ సేవలను ప్రారంభించిన సంస్థ సేవల నాణ్యతను పెంచుకునేందుకు టాటాలకు చెందిన టీసీఎస్ తో జతకట్టింది. టెక్నాలజీని అప్ గ్రేడ్ చేస్తోంది.

ఇదే క్రమంలో బీఎస్ఎన్ఎల్ ఉనికిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. ఇందుకు గాను కేంద్ర మంత్రివర్గం రూ.89,047 కోట్లతో అతిపెద్ద పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించిందని ప్రముఖ జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. అత్యంత విశ్వసనీయమైన వ్యక్తుల నుంచి అందిన సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి ముందు అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)ని మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో దేశంలో బీఎస్ఎన్ఎస్ తన 4జీ నెట్ వర్క్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ITIకి రూ.3,889 కోట్ల విలువైన ముందస్తు కొనుగోలు ఆర్డర్(APO)ని అందజేసింది. దీని ద్వారా వినియోగదారులకు అధునాతన 4G సేవలను అందించడానికి BSNL చేస్తున్న ప్రయత్నాల్లో ఒక ప్రధాన ముందడుగని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications