Chip Plants: నేడు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో దేశంలో మూడు సెమీకండక్టర్ ప్లాంట్లకు అనుమతి ఇచ్చింది. గుజరాత్, అసోం రాష్ట్రాల్లో రెండు ప్లాంట్లను రూ.1.26 లక్షల కోట్ల మెుత్తాన్ని టాటాలు వెచ్చించనున్నారు.
రూ.91,000 కోట్ల అంచనా వ్యయంతో గుజరాత్‌లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్, తైవాన్‌కు చెందిన PSMC ద్వారా భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్రతిపాదనలు ఉన్నాయి. టాటా జెవి నెలకు 50,000 వేఫర్‌ల సామర్థ్యంతో ధోలేరాలో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను తయారు చేయనున్నట్లు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఫిబ్రవరి 29న తెలిపారు. చిప్ ఫ్యాబ్ పథకం ద్వారా ప్రత్యక్షంగా 26,000 మందికి ఉపాధి లభిస్తుందని, దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వైష్ణవ్ తెలిపారు. ధోలేరాలో మొదటి వాణిజ్య సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను టాటా, పవర్‌చిప్-తైవాన్‌లు ఏర్పాటు చేయనున్నాయి.

తైవాన్‌లో 6 సెమీకండక్టర్ ఫౌండ్రీలు కలిగి ఉన్న పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్(PSMC).. టాటా ఎలక్ట్రానిక్స్ పవర్ లిమిటెడ్ సాంకేతిక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. నెలకు 50,000 వేఫర్లను తయారు చేసే కెపాసిటీని ఈ ప్లాంట్ కలిగి ఉండనుంది. 28 న్యానో మీటర్ల హైకెపాసిటీ కంప్యూటర్ చిప్స్ ఇందులో తయారు చేయబడనున్నాయి. దీనికి తోడు టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ప్లాంటును అసోంలో నెలకోల్పాలని టాటాలు నిర్ణయించారు.
అసోంలో ఏర్పాటు చేయనున్న ప్లాంటుకు టాటాలు రూ.27,000 కోట్లను వెచ్చిస్తోంది. ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, టెలికాం, మొబైల్ ఫోన్లలో వినియోగించే టిప్‌లను ఇక్కడ తయారు చేయనున్నారు. రోజుకు 48 మిలియన్ల సెమీకండక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. చివరిగా ప్రత్యేక చిప్స్ కోసం మూడో సెమీకండక్టర్ ATMP యూనిట్ గుజరాత్ సనంద్‌లో.. CG పవర్, జపాన్‌లోని రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, థాయ్‌లాండ్‌లోని స్టార్స్ మైక్రోఎలక్ట్రానిక్స్ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకోసం వారు రూ.7,600 కోట్లను వెచ్చిస్తున్నారు. ఈ ప్లాంట్ కెపాసిటీ రోజుకు 15 మిలియన్లుగా ఉండనుంది.


Click it and Unblock the Notifications