PM Bijili Yojana: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్.. మోదీ క్యాబినెట్ కీలక పథకానికి ఆమోదం..
Solar News: ఫిబ్రవరి 1న జరిగిన మధ్యంతర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ దేశంలోని గృహ వినియోగదారులకు సోలార్ కోటి కుటుంబాలకు అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకానికి (పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన) కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సోలార్ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.75,021 కోట్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 13 ఫిబ్రవరి 2024న ప్రారంభించారు. ప్రభుత్వ ఈ పథకం ద్వారా సోలార్ వ్యాపారానికి సంబంధించిన కంపెనీలు మంచి వ్యాపారాన్ని పొందుతాయని భావిస్తున్నారు.

PM సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద.. 1kW వ్యవస్థ కోసం రూ.30,000 సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. అలాగే 2kW సోలార్ సిస్టమ్‌లకు రూ.60,000, 3kW లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సిస్టమ్‌లకు, రూ.78,000 సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. కుటుంబాలు జాతీయ పోర్టల్ ద్వారా సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూఫ్‌టాప్ సోలార్ కోసం విక్రేతను ఎంచుకోవచ్చు.
గృహాలు సోలార్ ఇన్‌స్టాలేషన్ కోసం తనఖా లేకుండా దాదాపు 7% తక్కువ వడ్డీ రుణ ఉత్పత్తులను పొందగలుగుతారు. అలాగే ప్రతి జిల్లాలో మోడల్ సోలార్ గ్రామాలను అభివృద్ధి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూఫ్‌టాప్ సోలార్‌ను దత్తత తీసుకుని రోల్ మోడల్‌గా వ్యవహరిస్తారు. రాయితీల నుంచి బ్యాంకు రుణాల వరకు అధిక రాయితీలతో ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని ప్రధాని గతంలోనే పథతం ప్రయోజనాల గురించి వెల్లడించారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోగలుగుతారు. కుటుంబాలు అదనపు ఆదాయాన్ని పొందగలుగుతారు. దీని కోసం వారు డిస్కమ్‌లకు మిగులు విద్యుత్‌ను విక్రయించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ తయారీ, లాజిస్టిక్స్, సరఫరా గొలుసు, అమ్మకాలు, సంస్థాపన, O&M ఇతర సేవల్లో సుమారు 17 లక్షల ఉద్యోగాలకు అవకాశాలను సృష్టిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications